26న సమ్మె ఎందుకు?

ఈ నెల 26న సమ్మె, 27న నిరసనలు ఎందుకు ?

  1. దేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా కార్మిక, కర్షకులు(రైతులు)ఉద్యోగ, ఫెన్షనర్లు ఒకేసారి ఎందుకు పిలుపునిచ్చారు?
  2. ఇది జీతాల కోసమో, సెలవుల కోసమా వారి వ్యక్తిగత స్వార్థం కోసమో కాదన్న విషయం మీకు తెలుసా
  3. ఆర్ధిక వ్యవస్థ మైనస్ లోనికి పడిపోవడానికి, ధరలు పెరుగుదలకు, కరోనాలో వలస కార్మికులు అన్యాయంగా బలైపోవడానికి, ఉద్యోగాలు ఊడిపోయినందుకు, నిరుద్యోగ సమస్యకు మూలాలపై జరుగుతున్న సమ్మె అని నీకు తెలుసా?
  4. ఇప్పటికే అన్నదాతలు అత్మహత్యలు పెరిగిపోయాయి. పంటకు గిట్టుబాటు లేదు. ధరను గ్యారంటీ చేస్తూ చట్టం చేయమంటే మొత్తం వ్యవసాయాన్ని కార్పోరేట్ కంపెనీలకు అప్పగించే మూడు నల్ల చట్టాలు చేసి రైతాంగాన్ని శాశ్వతంగా దివాలా తీయించే చట్టాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం
  5. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వమే కంపెనీలు పెట్టాలి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ మోదీ ప్రభుత్వం BSNL, SBI, తపాలా, రైల్వేలో బలవంతంగా VRS ఇచ్చి ఉద్యోగులను తొలగించింది. లాభాల్లో ఉన్న LIC, railway, BHPV, స్టీల్ ప్లాంట్, గనులను ప్రైవేటు వారికి అమ్మేస్తోంది. దానికి వ్యతిరేకంగా ఈ పోరాటం. అంటే నీ ఉద్యోగం కోసమే కదా!
  6. కనీసం వేతనం, ఉద్యోగం గ్యారంటీ, అదివారం సెలవు, ఎనిమిది గంటలు పని, పని ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగితే వెంటనే వైద్యం కల్పించే చట్టాలను రద్దు చేసి, ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలకు కట్టుబానిసలుగా మార్చే బ్రిటిష్ చట్టాలను తిరిగి తీసుకోచ్చిన బిజెపి ప్రభుత్వ దుర్మార్గాలపై ఈ పోరాటం. అంటే నీ కోసం, నా కోసమే కదా
  7. కరోనాలో పని పోయి ఆకలితో ఆలమటించే వారికి నెలకు 7500సాయం చేయమంటే కదలని కేంద్రం కేవలం పదిమంది కార్పోరేట్లకు ఒక నెలలో 66,800కోట్లు మన ధనం దోచిపెట్టినందుకు నిరసనగా ఈ సమ్మె.
  8. విమానాశ్రమాల్లో ఆపగలిగే కరోనాను దేశం మీదకు వదలి మన ఆస్తులను అప్పనంగా అమ్మేసి, మన డబ్బు కార్పోరేట్లకు దారపోసి, నిరుద్యోగాన్ని పెంచి మత ఘర్షణలు సృష్టిస్తూన్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ పోరాటం.
  9. కనీస వేతనం రూ.600 ఇవ్వాలి. పట్టణ ఉపాధి హామీ చట్టం కావాలని, గ్రామీణ ఉపాధి పనులు 200రోజులు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని, నల్ల చట్టాలు, బ్రిటిష్ కార్మిక చట్టాలు రద్దు చేయాలని, కరోనాలో పనిపోయిన వారికి 7500ఇవ్వాలని, ప్రభుత్వ సంస్థలు అమ్మోద్దని, రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయాలనీ, మత ఘర్షణ వద్దు శాంతి కావాలని జరుగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *