రాములమ్మ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం అందింది. కాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె ఆదివారం రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. కాగా నేడు సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.వాస్తవానికి విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో చాలాకాలంగా స్తబ్దతగా ఉంటున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అధిష్టానం అప్పగించినా రాష్ట్ర నాయకత్వం సహకరించకపోవడంతో ఆమె అసంతృప్తి చెందారు. దీంతో ఆమె కాంగ్రెస్‌ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనలేకపోవడమే కాకుండా పార్టీ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టారు. 

ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మాణిక్యం ఠాగూర్‌ తొలిసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు జరిగిన సమావేశాలకు విజయశాంతిని ఆహ్వానించినా వెళ్లకుండా తన ఉద్దేశాన్ని ఢిల్లీ పెద్దలకు తెలిపారు. ఇక, దుబ్బాక ఎన్నికల వ్యవహారంలో ఆమెను పార్టీ కానీ, పార్టీని ఆమె కానీ పట్టించుకోలేదు. రాష్ట్ర నాయకత్వం కూడా విజయశాంతి వస్తే స్వాగతిస్తామని, పార్టీ కార్యకలాపాలకు ప్రత్యేక ఆహ్వానాలు ఉండవనే ధోరణిలోనే వ్యవహరిస్తోంది.

దీంతో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులకు, విజయశాంతికి మధ్య రాజకీయదూరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్వయంగా విజయశాంతి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. దీంతో ఆమె మళ్లీ పాత గూటికే చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆమెను కాంగ్రెస్‌ పెద్దలు బుజ్జగించినా… పార్టీ వ్యవహారశైలి పట్ల అసంతృప్తి ఉన్నా విజయశాంతి చివరికి హస్తం వీడేందుకే సిద్ధపడ్డారు.  బీజేపీ పెద్దలు కూడా ఆమె రాకను స్వాగతించడంతో విజయశాంతి హస్తానికి హ్యాండ్‌ ఇచ్చి కమలానికి జై కొట్టారు. ఇలాంటి విషయలన్నీ రాజకీయ నాయకులకు సాధారణ మైనా, ప్రజలు మాత్రం అవకాశ వాద రాజకీయా లు అందరికీ వంట పట్టవని అనుకోవటం విశేషం….

3 Replies to “రాములమ్మ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..”

  1. A must read article. I completely agree with you that the qualities mentioned in this article make a good teacher. Very authentic. Keep it up. Clemence Gaylor Gaye

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *