డిశ్చార్జ్ చెయ్యకండి అంటూ వైద్యులను రిక్వెస్ట్‌ చేసిన సౌరవ్ గంగూలీ..?

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్ వాయిదా వేశారు. కోల్‌కతాలోని తన నివాసంలో గత శనివారం నాడు వ్యాయామం చేస్తుండగా గంగూలీకి స్వల్ప గుండెపోటు రావడంతో హుటాహుటిన అతని కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్‌ ఆసుపత్రికి పంపించారు. గంగూలీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. అతని గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికట్లు ఉన్నట్లు తేల్చారు. ఆ వెంటనే యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు.

యాంజియోప్లాస్టీ తర్వాత సౌరవ్ గంగూలీ యాక్టీవ్‌గానే ఉన్నాడని తెలిపిన వుడ్‌ల్యాండ్స్ వైద్యులు.. మరో యాంజియోప్లాస్టీ నిర్వహించడంపై తొమ్మిది మందితో కూడిన మెడికల్ బోర్డుని గత సోమవారం ఏర్పాటు చేశారు. ఈ టీమ్.. గంగూలీ ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి.. ఇప్పట్లో దాదాకి మరో యాంజియోప్లాస్టీ అవసరం లేదని తెలుపగా దాంతో.. గంగూలీని బుధవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు వుడ్‌ల్యాండ్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే.. ఈరోజు విడుదల చేసిన బులిటెన్‌లో గంగూలీ డిశ్చార్జ్‌ని వాయిదా వేసినట్లు ఆసుపత్రి పేర్కొన్నది.

గంగూలీ ఈరోజు రిక్వెస్ చేయడంతో ఆయనను గురువారం డిశ్చార్జ్ చేయబోతున్నాం. మరో రోజు ఆసుపత్రిలో ఉంటారు. గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. వైద్యులు ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు’’ అని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *