విజయ డైరీ నుంచి కొత్త ప్రొడక్ట్.. ఏంటంటే?

నష్టాల ఊబిలో నుండి లాభాల బాటలో పయనిస్తున్న తెలంగాణ విజయ డెయిరీ మరో నూతన ఉత్పత్తిని మార్కెట్ లోకి విడుదల చేయనుంది. తెలంగాణ విజయ డెయిరీ నూతన ఉత్పత్తి విజయ ఐస్ క్రీం ను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు నాంపల్లి లోని లలిత కళాతోరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ G.కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్, నాంపల్లి MLA జాఫర్ హుస్సేన్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి శ్రీ అనిత రాజేంద్ర, విజయ డెయిరీ చైర్మన్ శ్రీ లోక భూమారెడ్డి ల సమక్షంలో ఆవిష్కరిస్తారు. విజయ పేరుతో కుల్ఫీ, చాకోబార్, అమెరికానో, బెల్జియన్ డార్క్ చాకొలేట్, ఫ్రెంచ్ వెనీలా తదితర 30 రకాల ఫ్లేవర్ లలో ఐస్ క్రీం లను ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నష్టాలలో ఉన్న విజయ డెయిరీ, రాష్ట్రం ఆవిర్బవించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఆదేశాలతో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో అనేక కార్యక్రమాలు, నిర్ణయాలతో విజయ డెయిరీ లాభాల బాటలో పయనిస్తుంది. ప్రైవేటు డెయిరీలకు దీటుగా విజయ డెయిరీ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించడం, విజయ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున నూతనంగా ఔట్ లెట్స్ ఏర్పాటుతో విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 362 ఔట్ లెట్స్ ద్వారా విజయ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *