యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై వున్నాయి. వీటిలో ఒకటి ‘సలార్’ కాగా, మరొకటి ‘ఆదిపురుష్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘సలార్’ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా తెలంగాణలోని గోదావరిఖని ఓపెన్ కాస్ట్ ఏరియాలో జరుగుతోంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక మాస్ మసాలా ఐటం సాంగు ఉందట. ఈ పాటలో డ్యాన్స్ చేయడానికి గాను బాలీవుడ్ భామ, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆమె కుదరని పక్షంలో మరో బాలీవుడ్ నటి దీపిక పదుకొనెను అయినా తీసుకోవాలని చిత్ర దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది.
