మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు… ఎంతంటే?

ఓ రెండు రోజుల గ్యాప్ తో మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. డీజీల్ ధర కూడా 35 పైసలు పెరిగింది. పెరిగిన రేట్లతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ (ఇండియన్ ఆయిల్ సోర్స్) ధర రూ. 87.30, డీజిల్ ధర రూ. 77.48కి చేరుకుంది. ముంబైలో అత్యధికంగా పెట్రోల్ ధర రూ. 93.83, డీజిల్ ధర రూ. 84.36కి పెరిగింది. విదేశీ మారకద్రవ్య రేట్లను అనుసరించి ధరలు మారుతున్నట్టుగా పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు చెపుతున్నాయి. పెరిగిన ధరలను సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి తీసుకొస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *