అర్జున్-హర్భజన్‌ సింగ్ ల కాంబినేషన్లో ఫ్రెండ్‌షిప్.. తెలుగులో కూడా..?

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ చిత్రం ‘ఫ్రెండ్‌ షిప్‌‘. రూ.25 కోట్ల బడ్జెట్‌తో తమిళ్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేటుకు శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏ.ఎన్. బాలాజీ దక్కించుకున్నారు.

జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య సంయుక్త దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని “ఫ్రెండ్ షిప్” పేరుతోనే.. ‘సింగ్ అండ్ కింగ్‘ అనే ట్యాగ్ లైన్ జతచేసి.. తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు బాలాజీ సన్నాహాలు చేస్తున్నారు. హర్భజన్‌ సింగ్‌కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్‌ చివరి షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీలలో జరగనుంది.

ప్రస్తుతం కోయంబత్తూర్, తదుపరి ఊటీలో చివరి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాజీ ‘మిస్ శ్రీలంక’ మరియు తమిళ బిగ్ బాస్ విన్నర్ ‘లోస్లియా’ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ‘జి-జాంబి’ హీరో ఆర్యన్ గౌడ్, ‘రంగస్థలం’ మహేష్, అంకిరెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *