ప్రేమికుల రోజున గ్రేట్ న్యూస్ చెప్తానంటున్న శ్రీముఖి.. న్యూస్ పేపర్ డ్రెస్ తో హాట్ ఫోటోలు…

యాంకర్ శ్రీముఖి ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14న) గ్రేట్ న్యూస్ చెప్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో పాటు న్యూస్ పేపర్ లాంటి షార్ట్ డ్రెస్‌లో హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసినవాళ్లు శ్రీముఖి తన పెళ్లి గురించే చెప్పబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే ‘అక్కకు బావ దొరికినట్టున్నాడు’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీముఖి సోషల్ మీడియా హ్యాండిల్స్ పెళ్లి కామెంట్లతో నిండుతున్నాయి.

శ్రీముఖి నిజంగా వాలెంటైన్స్ డే నాడు తనకు కాబోయే భర్తను పరిచయం చేయబోతుందా అంటే అనుమానమే. ఈ ప్రకటన తన కొత్త టీవీ షో గురించైనా కావచ్చు. కాబట్టి అభిమానులు ముందుగానే ఎగ్జయిట్ కావడం అనవసరం. ఫిబ్రవరి 14 వరకు వేచి చూస్తే మంచిది. కాగా, శ్రీముఖి పోస్ట్ చేసిన ఫొటోలు చూసిన కొంత మంది అభిమానులు ‘ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకు అక్క’ అని సలహాలు ఇస్తున్నారు. కొంత మంది అయితే హాట్ బ్యూటీ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *