‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ సినిమాతో పాపులర్ అయిన పంజాబీ భామ మెహరీన్ పిర్జాదా.. తను నటించిన ఈ తొలి సినిమా విడుదలై నిన్నటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు. దీంతో మెహరీన్ అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి సంతోషం, కాస్త బాధ కలిగించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మెహరీన్ త్వరలోనే వెండితెరకు గుడ్ బై చెప్పబోతోందట…
పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు ఈ అమ్మడు సిద్ధమవుతోందట. అది కూడా ఆషామాషీ వ్యక్తిని కాదు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి మనువడిని మెహరీన్ పెళ్ళాడబోతుంది . హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు అయిన భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం జరుగనుందట. ఇప్పటికే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందట.
భవ్య బిష్ణోయ్, మెహరీన్‌ల పెళ్లి మార్చి 13న చేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయట. జోధ్‌పూర్‌లోని ఓ కోటలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. భవ్య ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు. భవ్య బిష్ణోయ్ కూడా రాజకీయ నాయకుడే. ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఇక పెళ్లి తర్వాత మెహరీన్ సినిమాలకు దూరం కానుందట.
