కేసీఆర్ పై పాటలు విడుదల చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ ..

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేశారు. ఈ పాటలను ప్రముఖ నేపథ్య గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, మధుప్రియ పాడారు. కేసీఆర్‌ పుట్టిన రోజైన ఈనెల 17న జంట నగరాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీరను సమర్పిస్తారని వెల్లడించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీతో నిర్వహిస్తామని చెప్పారు. అలాగే 300 మంది మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

జలవిహార్‌లో కేసీఆర్‌ బాల్యం, రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంపై 3డీ గ్రాఫిక్స్‌లో 30 నిమిషాల డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుందన్నారు. బోయిగూడ వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా జలవిహార్‌లో మొక్కలు నాటుతామని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి ఎంపీ సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. దీనిద్వారా హరిత ప్రియుడికి కోటి మొక్కల బహుమతిని అందిద్దామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *