వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించి ఏ కమిటీలోనూ సభ్యుడిగా లేను: ఎంపీ అవినాష్ రెడ్డి



*మీడియాతో కడప పార్లమెంట్ సభ్యుడు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి పాయింట్స్..*

టీడీపీ నాయకుడు నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది..

తనతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జలపై అవాస్తవ ఆరోపణలు చేయడం దుర్మార్గం…

కోతి చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది లోకేష్ తీరు..

విశాఖ స్టీల్ ప్లాంట్ కమిటీ లో తాను సభ్యునిగా ఉన్నానని అసత్య ఆరోపణలు చేస్తున్నారు..

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించి తాను ఏ కమిటీలో సభ్యుడిగా లేను.. ఏ సమావేశంలో పాల్గొనలేదు.

అబద్ధాలు నిజం అని ప్రచారం చేసే చంద్రబాబు సిద్ధాంతాన్ని లోకేష్ ఫాలో అవుతున్నారు..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం..

దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారు…

ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ స్పందిస్తే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎం చేస్తున్నారు…?

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గురించి విమర్శలు చేయడం దారుణం..

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అని తప్ప లోకేష్ కు చెప్పుకునేందుకు ఏం అర్హత ఉంది…

మోకాలికి బోడి గుండుకు లింకు పెట్టడం ఏంటి…

చంద్రబాబు, లోకేష్ తీరు మార్చుకోవాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *