సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత…? అందుకేనేమో..

జాను సినిమా ప్లాప్ తర్వాత తెలుగులో సమంత ఏ సినిమా కూడా ఓకే చేయలేదు. ఆ మధ్య ఎన్నో పుకార్లు వచ్చినప్పటికి గుణశేఖర్ తెరకెక్కించనున్న శకుంతల మూవీకి సంతకం చేసింది సామ్. ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోందట. ఈ పాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూట్ ఈ నెలలోనే హైదరాబాద్లో ప్రారంభమవుతుందని సమాచారం. అయితే ఈ సినిమా తర్వాతే బ్రేక్ తీసుకోవాలని.. అందుకే కొత్త ప్రాజెక్టులపై సంతకం చేయట్లేదని టాక్. కానీ తాజా సమాచారం ప్రకారం.. సమంత కొంతకాలం సినిమాలకు బ్రేక్ చెప్పి తన పర్సనల్ లైఫ్ కోసం సమయం కేటాయించనుందని అంటున్నాయి సన్నిహితవర్గాలు. నాగచైతన్యతో సమంత పెళ్ళై నాలుగేళ్లు దగ్గరపడింది. ఇంతవరకు ఫ్యామిలీ పరంగా ఎలాంటి టైం స్పెండ్ చేయలేదని సినీవర్గాలలో టాక్. చూడాలి మరి సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిస్తుందో… లేదో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *