ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫిర్యాదు.

ఈ నెల 25వ తేదీన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ(NCPCR) తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో తెలంగాణా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ విద్యా సంస్థల సొసైటీ(TSWREIS) కి వ్యతిరేకంగా పిర్యాదు చెయ్యటం జరిగింది. ఇది ప్రధానంగా TSWREIS కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ IPS లక్ష్యంగా చేయబడింది. తెలంగాణా ప్రభుత్వం చేత అణగారిన వర్గాల కోసం నడపబడుతున్న అనేక విద్యా సంస్థలలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులతో SWAEROES (స్వేరోస్) అనే ప్రైవేట్ సంస్థను ప్రభుత్వ విద్యా సంస్థలలో భాగంగా చేసి ప్రవీణ్ కుమార్ నడుపుతున్నాడనేది ప్రధాన ఆరోపణ. ఈ ప్రైవేట్ సంస్థకు తనదైన ప్రతిజ్ఞ, గీతం, గురు మంత్రం ఉన్నాయి. స్వేరోస్ వాలంటీర్లు ప్రజాధనంతో నడుస్తున్న ప్రభుత్వ విద్యా సంస్థల పాలనలో నిరంతరం జోక్యం చేసుకుంటున్నారు.


ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు మత బోధ చెయ్యటానికి క్రైస్తవ మత ప్రచారకులకు స్వేరోస్ సంస్థ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. అలాగే హిందువుల పండుగలకు సెలవులు ఇవ్వకుండా విద్యార్థులను చదువు పేరుతో ఇళ్ళకు వెళ్లకుండా చూస్తున్నారు అని ప్రస్తావించారు.ఈ ఆరోపణలను విచారించి 10 రోజుల్లో నివేదిక పంపాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కోరింది. ఇటీవల హిందూ సంస్థలు కావాలని అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలోనే ఈ ఫిర్యాదు వచ్చినట్లు స్వేరోస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. కక్షపూరితంగా ఒక ఐపీఎస్ అధికారి పై ఇలా చేయడాన్ని స్వేరోస్ సంస్థ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శిస్తున్నది.

One Reply to “ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫిర్యాదు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *