మహాలయ అమావాస్య సంధర్బంగా శ్రీకాళహస్తిశ్వర దేవస్థానములో పోటెత్తిన భక్తజనం..!

కరోనా మహమ్మారితో భక్తులు లేక వెలవెలబోతున్న శ్రీకాళహస్తి దేవస్థానం,  కరోనామహమ్మారి  ఉద్రిక్తత తగ్గడంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తజనసందోహంతో ఆలయం కళకళలాడుతుంది,నేడు మహాలయ అమావాస్య పురస్కరించుకొని ఆలయంలో భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనార్థం , మరియు రాహు కేతు పూజలు నిర్వహించుకోవడనికి ,  అభిషేకది ,   పూజది ,  కార్యక్రమాలు హోమాలు   నిర్వహించడానికి ఆలయంలో భక్తులు పోటెత్తారు.  దీంతో ఆలయంలో రాహు కేతు మండపాలు ఆలయ పరిసర ప్రాంతాలు భక్తజనసందోహంతో ఓంకార నామస్మరణతో మారుమోగుతోంది ఆలయం పూర్వవైభవాన్ని సంతరించుకుంది. 
భక్తులు తమ అనుభూతుల్ని పంచుకుంటూ..

ఏటా రెండు మూడు సార్లు శ్రీకాళహస్తీశ్వరాలయము దర్శించుకునే ,  తము  కరోనామహమ్మారి చే స్వామిఅమ్మవారిలా దర్శనలులేక,   జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వర దర్శనం కోసం తహతహలాడిపోయామని ,   అయితే ప్రస్పుతo  కరుణమహమ్మారి కొద్దిపాటి విజృంభించనా  తగ్గడంతో ,  మహలయ అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవారి సన్నిధిలో పూజాది కార్యక్రమాలు రాహుకేతు పూజలు,  స్వామి అమ్మవార్ల దర్శనం కోసం సుదూరతీరాల నుంచి వస్తున్నామని,  కరోనా  మహమ్మారి దృష్టిలో ఉంచుకొని  ఆలయ అధికారులు ఆలయంలో  పటిష్టమైన ఏర్పాట్లు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా   జ్ఞానప్రసూనాంబసామెత సోమస్కందమూర్తి  దర్శనానికి  ఏర్పాట్లు మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారని , ఆలయ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *