ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు -సుప్రీంకోర్టు ఆదేశాలు

*న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)*

_*ప్రతీ పోలీస్ స్టేషన్ లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు..!!*_

★ సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది.

★ ప్రతి పోలీస్ స్టేషన్లలోను సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

★ అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

★ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి.

★ అధికారం ఉన్నవారికి.. డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ.. సమాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవటంలేదు.

★ కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్ మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి.

★ లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండాదండ ఆరోపణలతో ఆ వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది.

★ కొన్ని సందర్భాల్లో పీఎస్ లలో జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు.

★ ఏపీలో ఓ దళితుడికి స్టేషన్‌లో శిరోముండనం చేయించడం కలకలకం రేపిన తెలిసిందే.

★ కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతుంటాయి.

★ ఏకంగా మద్యం తాగి పోలీసులే చిందులు వేయటం చూశాం.

★ ఇలా పీఎస్ లలో జరిగేది ప్రతీదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతోను.. తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పీఎస్ ల విషయంలో సుప్రీం కోర్టు జూలు విదిలించింది.

★ అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది.

*దీనికి సంబంధించి పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *