బీజేపీకి భారీ ఎన్నిక‌ల బాండ్ల విరాళాలు.. ఎంతంటే?!

ఎలక్ట్రోర‌ల్ బాండ్ల రూపేణ నిధుల సేక‌ర‌ణ‌లో బీజేపీ స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో మొత్తం వివిధ రాజ‌కీయ పార్టీల‌కు ఎల‌క్ట్రోర‌ల్ బాండ్ల ద్వారా రూ.3,355 కోట్ల మేర‌కు నిధులు వ‌చ్చాయి. వాటిల్లో బీజేపీకి 76 శాతం.. అంటే రూ.2,555 కోట్ల మేర‌కు విరాళాలు వ‌చ్చాయి. అంత‌కుముందు 2018-19లో కేవ‌లం రూ.1,450 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. బీజేపీ ప్ర‌ధాన ప్ర‌త్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే 17 శాతం విరాళాలు త‌గ్గిపోయాయి. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.389 కోట్ల విరాళాలు అందుకున్న హ‌స్తం పార్టీకి 2019-20లో కేవ‌లం రూ.318 కోట్ల విరాళాలే వ‌చ్చాయి. మ‌మ‌తా బెన‌ర్జీ సార‌ధ్యంలోని త్రుణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ రూ.100.46 కోట్లు, శ‌ర‌ద్ ప‌వార్ ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ రూ.29.25 కోట్లు, శివ‌సేన రూ.41 కోట్లు, డీఎంకే రూ.45 కోట్లు, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ సార‌ధ్యంలోని ఆర్జేడీ రూ.2.5 కోట్లు, అర‌వింద్ కేజ్రీవాల్ ఆధ్వ‌ర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రూ.18 కోట్ల విరాళాలు సేక‌రించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *