మరి కొన్ని గంటల్లో జి శాట్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధం. అంతరిక్షంలో భారత్ వెలుగులు

తెలుగడ్డా న్యూస్ టీమ్ (టీఎన్టీ): శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఆగస్ట్ 12 తెల్లవారు జామున 5.43 గంటలకు ప్రయోగించనున్న జి శాట్-1 ఉపగ్రహంతో భారత్ గగనతలంలో మరో కొత్త రికార్డ్ సృష్టించనుంది. జిఎస్ఎల్వీ ఎఫ్10 ఈఓఎస్03 లక్ష్యంలో భాగంగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. భూతలాన్ని భూగర్భాన్ని పహారా కాసేందుకు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్) సిరీస్ లో ఈ ఉపగ్రహం మొదటిది. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఉపగ్రహం ప్రయోగించటం ద్వారా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది.
ఈ ఉపగ్రహం జియో సింక్రనస్ బదిలీ కక్ష ద్వారా స్థిర కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఈ ఉపగ్రహం గురించిన కొంత ముఖ్య సమచారం

1. భారత దేశ ప్రయోజానాలకు అనుగుణంగా ఎంచుకున్న భూభాగంపై ఈ ఉపగ్రహాన్ని కేంద్రీకరించవచ్చు. అటువంటి ప్రాంతం గురించి ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది.
2. పార్లమెంట్ లో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ అంతరిక్ష మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ భారత దేశవ్యాప్తంగా కవర్ అయ్యేలా ఈ ఉపగ్రహం రోజుకు నాలుగైదు ఫోటోలు పంపిస్తుందన్నారు.
3. ఈ ఫోటోల ఆధారంగా ప్రభుత్వం అప్పటికప్పుడు తలెత్తే ప్రకృతి వైపరీత్యాలు లేదో మరో రకమైన అత్యవసర పరిస్థితులను అదుపు చేసే రాపిడి యాక్షన్ టీమ్స్ ని పురమాయిస్తుంది..
4. ప్రత్యేకించి అడవులు, వ్యవసాయం, గనులు, ఖనిజవనరులు, మేఘాలు, మంచు కొండలు, సముద్ర గర్భం గురించిన లోతైన సమాచారాన్ని ఈ ఉపగ్రహం నిక్షిప్తం చేస్తుంది. పర్యవేక్షణా కేంద్రానికి చేరవేస్తుంది.
5. ఈ అంతరిక్ష ప్రయోగ నౌక మొదట ఉప గ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి ప్రవేశ పెడుతుంది. ఉపగ్రహం తుది కక్ష్యలోకి ప్రవేశించటానికి ముందరి దశ ఇది. ఈ కక్ష్య సముద్ర మట్టం నుండి 42164 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది.
6. ఈ ఉపగ్రహం భూభ్రమణ వేగంతో తిరుగుతుంది. అందువల్ల ప్రతిసారీ భూ భ్రమణ వేగంతో ఉపగ్రహం తన భ్రమణ వేగాన్ని సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతే కాక భూ భ్రమణ వేగంతో తిరగటంతో స్థల కాల పరిస్థితుల్లో యథా తథా స్థితి లో (రియల్ టైం) ఫోటో చిత్రాలను అందచేయగలుగుతుంది.
7. ఈ.ఉపగ్రహం బరువు 2268 కిలోలు. అంతరిక్ష నౌక పేరు ఈఓఎస్3. శ్రీహరికోటలోని పద్నాలుగవ లాంచ్ పాడ్ నుండి ప్రయోహించబడుతుంది.
8. అంతరిక్ష నౌకలో ఉపయోగించే ఇంధనంలో ఇస్రో కొన్ని మార్పులు చేసింది.
9. తొలుత ఈ రాకెట్ ప్రయోగం మార్చి 5న నిర్వహించాలని నిర్ణయించారు. కానీ కోవిడ్ రెండో ఉప్పెన కారణంగా వాయదా వేశారు. కొన్ని సాంకేతిక కారణాలు కూడా తోడయ్యాయి. మొత్తంగా మూడు సార్లు వాయిదా పడ్డాక ఆగస్ట్ 11 తేదీ ఖరారు అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *