Paralympics: టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్స్‌కు భవీనాబెన్‌. పతకం ఖాయం..

టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భవీనాబెన్‌ పటేల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో పారాలింపిక్స్‌లో భారత్ కు పతకం ఖాయమైంది. సెమీఫైనల్లో భవీనాబెన్‌ చైనా క్రీడాకారిణి జాంగ్‌ మియావోను 3-2 తేడాతో ఓడించింది. ఈ విజయంతో భవానిబెన్‌ దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. భవీనాబెన్‌ సెమీఫైనల్లో ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. చైనాకు చెందిన జాంగ్‌ మియావోను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో ఓడించింది. దాదాపుగా 34 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తన సత్తా ఏంటో చూపించింది. తొలి గేములో భవీనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఐతే మంచి ఫామ్ లో ఉన్న ఆమె వెంటనే పుంజుకుంది. వరుసగా రెండు గేములు కైవసం చేసుకొని 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో గేమ్‌ను ఆమె కేవలం 4 నిమిషాల్లో గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *