ధోనీపై గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు. ఆయన చేసేదేం ఉండదంటూ….

మాజీ కెప్టెన్‌ ధోనిని టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే ఇండియా టీంకు మెంటర్‌గా నియమించడంపై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌లు ఉండగా మెంటర్‌గా ఎంఎస్ ధోని చేసేదేం ఉండదంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేశాడు. అయితే ఒత్తిడిని అధిగమించడం ఎలానో బాగా తెలుసనే కారణంతో మహీని మెంటర్‌గా ఎంపిక చేసి ఉండవచ్చంటూ గంభీర వ్యాఖ్యానించాడు.

ఓ ప్రముఖ క్రీడా ఛానల్‌లో జరిగిన‌ కార్యక్రమంలో మాట్లాడిన గంభీర్.. మెంటర్‌గా ధోని ఎంపికకు గల కారణాలపై విశ్లేషణ చేస్తూ,  ప్రస్తుతం భారత జట్టు పొట్టి ఫార్మాట్‌లో విజయవంతంగా కొనసాగుతోందని, ఇలాంటి సందర్భంలో మెంటర్‌ పోస్ట్‌ను ప్రత్యేకంగా సృష్టించి ధోనికి బాధ్యతలు అప్పజెప్పడంలో అర్ధం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ ఫార్మాట్‌లో టీమిండియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంటే మెంటర్‌ అవసరముండేదని, కానీ.. ప్రస్తుత పరస్థితుల్లో ధోని నియామకం హాస్యాస్పదమనని గంభీర్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *