పైవేటీకరణను అడ్డుకున్న కేరళ – బిహెచ్‌ఇఎల్‌ స్వాధీనం.

ప్రైవేటీకరణ బారిన పడకుండా బిహెచ్‌ఇఎల్‌ను కేరళ ప్రభుత్వం అడ్డుకుంది. తమరాష్ట్రంలోని బిహెచ్‌ఇఎల్‌ యూనిట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దానిని స్వాధీనం చేసుకుంది.
దీనికోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 77 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పెట్టిన జీతాలను చెల్లించేందుకు మరో 14 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ప్రైవేటైజేషన్‌, మానిటైజేషన్‌ పేర్లతో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఆ జాబితాలో కాసరగూడ జిల్లాల్లోని బిహెచ్‌ఇఎల్‌ – ఎలక్ట్రికల్‌ మిషన్స్‌ లిమిటెడ్‌ (బిహెచ్‌ఇఎల్‌-ఇఎంఎల్‌) కూడా ఉంది. ప్రైవేటీకరణ సన్నాహాల్లో భాగంగా రెండు సంవత్సరాలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థను స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 8న ఆ ప్రక్రియను పూర్తి చేసింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలన్నది తమ ప్రభుత్వ విధానమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *