హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టివేత. రూ.142 కోట్ల నగదు సీజ్

హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. 6 రాష్ట్రాల్లో 4 రోజులపాటు 60 చోట్ల హెటిరో సంస్థల్లో ఐటీ దాడులు నిర్వహించారు. రూ.550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించిన అధికారులు
రూ.142 కోట్ల నగదు సీజ్ చేశారు.

పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించిన ఐటీ అధికారులు
మూడ్రోజులుగా లాకర్స్‌ను తెరిచి పరిశీలిస్తున్నారు. వందలకొద్ది అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టారు. బీరువాల్లో మొత్తం రూ. 500 నోట్ల కట్టలే ఉన్నాయి.
పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలు సీజ్ . చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు అధికారులు గుర్తించారు.

ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ.142 కోట్లు దాచారు.
ఇనుప బీరువాల్లో డబ్బును కుక్కి పెట్టారు.
ఒక్క బీరువాలో రూ. 5 కోట్ల నగదు దాచారు.
డబ్బు లెక్కపెట్టేందుకే ఐటీ అధికారులకు రెండు రోజుల సమయం పట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *