ప్రాజెక్టులపై కేంద్రం తీరుపై తెదేపా నిరసన ఆగ్రహం


◆తెదేపా ఆధ్వర్యంలో గెజిట్ కాపీలు దగ్ధం
◆కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలు వీడాలి
◆తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి

ఖమ్మం: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళనను ఉద్దేశించి కూరపాటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్ర నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందన్నారు. ప్రాజెక్టుల విషయంలో నిరంకుశ విధానాలు వీడలన్నారు. ప్రాజెక్టుల పట్ల కేంద్రం తీసుకవచ్చిన గెజిట్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు మార్చుకోవలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శులు సానబోయిన శ్రీనివాసగౌడ్, నాగండ్ల మురళి, పార్లమెంట్ ప్రధానకార్యదర్శి గుత్తా సీతయ్య,TSNV పార్లమెంట్ అధ్యక్షుడు ఆకారపు శ్రీనివాస్,TSNVప్రధాన కార్యదర్శి మందపల్లి కోటేశ్వరరావు,TNTUC రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి భాస్కరరావు, నగర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి నీరుడు రాంబాబు, TNTUC జిల్లా నాయకుడు చండ్ర రవికుమార్, ఖమ్మం నగర నాయకులు వడ్డెమ్ విజయ్, నగర 3టౌన్ నాయకులు పారిస్ వెంకన్న, కోవెలమూడి జగదీష్, బెజవాడ రవి,స్వర్ణ నర్సింహారావు, జానీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *