అంచనాలు పెంచుతున్న జై బీమ్ ట్రైలర్…

సూర్య దక్షిణాదిలో ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు. గజని సినిమాతో సూర్య తెలుగు ప్రేక్షకుల హ‌ృదయాలను దోచుకున్నారు. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక తాజాగా ఆయన నటిస్తున్న మరో చిత్రం జై భీమ్ (Jai Bhim) . ఇది సూర్య 40వ సినిమా. ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటిస్తుండగా ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది. జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు, కార్పోరేట్ శక్తులకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా సూర్య గత చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ మాదిరిగానే ఓటీటీలో దీపావళీ సందర్భంగా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

One Reply to “అంచనాలు పెంచుతున్న జై బీమ్ ట్రైలర్…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *