రాష్ట్రంలో 450 విత్తన కంపెనీలు రైతులను మోసం చేస్తూన్నాయి: కోదండరెడ్డి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు

రాష్ట్రంలో 450 విత్తన కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని. విత్తన పంటలు వేయించి కొనుగోలు చేస్కొని రైతులకు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వేధిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆరోపించారు.

గాంధీ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ సూపర్ అగ్రి సీడ్స్ హైదరాబాద్ కంపెనీ రైతుల పేరిట 18 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నాయని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ…

•రైతులు బ్యాంక్ లకు పోతే ఎకరానికి 50 వేలు కూడా ఇవ్వని బ్యాంకులు ఇప్పుడు విత్తన కంపెనీలతో కుమ్మక్కు అయ్యి కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాయి.

•రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి విత్తన బౌల్ చేస్తానని చెప్పడంతో రైతులు విత్తన కంపెనీలను నముతున్నారు.

•ఈ నకిలీ విత్తన కంపెనీల విషయంలో మేము గతంలో అనేక సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన ఫలితం లేదు…

•రాష్ట్రంలో సమగ్ర విత్తన విధానం ఇంకా రూపొందించలేదు.

•రైతులు అప్రమత్తంగా ఉండాలి. విత్తన కంపెనీల మోసాలను అర్థం చేసుకోవాలి.

•ఏ కంపెనీతో అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకోవద్దు.

•బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వరు కానీ కంపెనీ దళారులకు మాత్రం కోట్ల రూపాయల అప్పులు రైతుల పేర్ల మీద ఇస్తున్నారు..

•రైతులు అప్రమతంగా ఉండాలి. ప్రభుత్వం ఇలాంటి వాటిపై లోతుగా విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలి.

•కేంద్రం తెచ్చిన కొత్త చట్టంలో కూడా ఒప్పంద వ్యవసాయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది.

•దాదాపు 450 సీడ్ కంపెనీలలో 80 శాతం ఇలాంటివే ఉన్నాయి. వీటిపై సమగ్ర విచారణ చేయాలి.

•ముఖ్యమంత్రి ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని రైతులకు కంపెనీలు ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇప్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

•కల్తీ, నకిలీ విత్తనాలపై తాము మంత్రిని కలిసాము, వ్యవసాయ కమిషనర్ ను కలిసాము, సీఎం కు లేఖ రాసాము. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

•కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి..

•ప్రభుత్వాలు, అధికారులు రైతులకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *