తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి క్రికెట‌ర్… ఎవరంటే?

ప‌శ్చిమ బెంగాల్ లోని అన్ని పార్టీల్లో హడావుడి మొదలైంది. కొంద‌రు సెల‌బ్రెటీలు రాజ‌కీయంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అడుగులు వేస్తున్నారు, త‌మ‌కు న‌చ్చిన పార్టీల్లో చేరుతున్నారు,

అయితే తాజాగా క్రికెటర్ మనోజ్ తివారీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించాడు. మీ అంద‌రి ప్రేమ, మ‌ద్ద‌తు నాకు అవ‌స‌రం అని ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా తెలిపాడు .మనోజ్ తివారీ ఇండియా త‌ర‌పున వన్డేలు, టీ20 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ఆడాడు మ‌నోజ్. ఆయ‌న తృణ‌ముల్ లో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌‌గానే పార్టీ నేత‌లు హర్షం వ్యక్తం చేశారు. నాలుగు వారాల క్రితం తివారీని పార్టీ నేత‌లు క‌లిశారు, ఇక లక్ష్మీ రతన్ శుక్లా ఇటీవ‌ల పార్టీకి రాజీనామా చేయడంతో ఆయ‌న స్ధానాన్ని మ‌నోజ్ భ‌ర్తీ చేస్తాడని భావిస్తున్నారు పార్టీ నేత‌లు. లక్ష్మీ రతన్ శుక్లా హౌరా జిల్లా క్రికెట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *