కేటీఆర్ సిగ్గు సిగ్గు.. లవ్ లెటర్ లు కాదు.. యువతకి ఉద్యోగ అపాయింట్ మెంట్ లెటర్లు కావాలి : దాసోజు శ్రవణ్

• ఉద్యోగ నియామకాలపై సవాల్ విసిరి పారిపోయిన కేటీఆర్ : ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా శ్రవణ్ దాసోజు

• కాంగ్రెస్ హయంలో కంటే ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారో తెలపాలన్న ఏఐసీసీ అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్కేటీఆర్ ప్రకటించిన విధంగా లక్షా ముప్పైరెండు వేల ఉద్యోగాల భర్తీని నిరూపించాలని బహిరంగ సవాల్ విసిరిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అనుకున్నంత పనీ చేసారు.గన్ పార్క్ దగ్గరికి చేరుకొని అమరవీరులకు నివాళులర్పించారు. కేటీఆర్ ప్రకటించినవి అంతా బూటకమని దుయ్యబట్టారు.‌ కేటీఆర్ కు ప్రత్యేకంగా కుర్చీ వేసిన శ్రవణ్ దమ్ముంటే ఉద్యోగాల భర్తీపై చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు.

తెలంగాణ భవన్ లో మాట్లాడిన కేటీఆర్ లక్షా ముప్పై రెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇచ్చి లక్షా ఇరవై ఆరు వేల ఉద్యోగాల భర్తీ చేశామని ప్రకటించి దీనిపై చర్చకు సిద్ధమని ప్రకటించిన కేటీఆర్ మాటలను నమ్మి వారికి బహిరంగంగా సామజిక మాధ్యమాల ద్వారా 26 న చర్చలకు రావాలని ఆహ్వానించినప్పటికీ కుర్చీ వేసి శాంతియుతంగా చర్చకు రావాలని ఆహ్వానించినప్పటికీ తండ్రి బాటలోనే మాట తప్పారని కేటీఆర్ పై దుయ్యబట్టారు.

తమ పార్టీ శాంతికాముక పార్టీ అని గాంధేయ మార్గం లోనే తాము అనుకున్నది సాధిస్తామని కానీ కేటీఆర్ రాత్రి పూట బహిరంగ లేఖల పేరుతో ప్రేమలేఖలు రాస్తున్నారని,ప్రేమలేఖలు బహిరంగ లేఖలు తెలంగాణ సమాజానికి అవసరం లేదని ఉద్యోగ నియామకపత్రాలు అవసరమని కేటీఆర్ మీకు ఇది న్యాయమా అని శ్రవణ్ సూటిగా ప్రశ్నించారు.

తెలంగాణ విభజన సమయం లో నాలుగు లక్షల పన్నెండు వేల ఉద్యోగాలు మంజూరై ఉండగా అప్పటికే మూడు లక్షల పన్నెండు వేల ఉద్యోగులు పని లో ఉన్నారని లక్ష ఏడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించారని ప్రస్తుతం లక్ష తొంభై ఒక్క వేల ఖాళీలు యెట్లా ఏర్పడ్డాయని ప్రకటించారని ఏడు సంవత్సరాల కాలం లో ఉద్యోగాల ఇచ్చి ఉంటె ప్రస్తుతం ఖాళీలు ఎందుకు ఉంటాయని శ్రవణ్ ప్రశ్నించారు.2014 లో మూడు లక్షలకు పైగా ఉద్యోగులు ఉంటె ప్రస్తుతం లక్షకు పైగా ఉద్యోగుల సంఖ్య ఎందుకు తగ్గి పోయిందో తెలపాలని ప్రశ్నించారు.

కాంట్రాక్టు పదమే ఉండొద్దని ప్రకటించిన కెసిఆర్ లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట బానిసలుగా తెలంగాణ ప్రభుత్వం లో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

అమరవీరుల స్తూపం సాక్షిగా శ్రీకాంతాచారి లాంటి వందలాంది తెలంగాణ అమరవీరుల శవాల సాక్షిగా నిరుద్యోగులందరికీ ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేసుకొని మీ ఇంట్లో ఉద్యోగాలు తెచ్చుకొని సరిపెట్టుకున్నారని శ్రవణ్ దుయ్యబట్టారు.

ప్రస్తుతం తెలీనంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని 2014లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసిన నోటిఫికేషన్ లో ఇరవై లక్షల మంది దరఖాస్తు చేసారని ప్రస్తుతానికి మరో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు పెరిగిపోయారని ఆవేదన వ్యక్తం చేసారు.
తెలంగాణ కోసమో మేము కూడా జీవితాలను అడ్డుపెట్టుకొని కొట్లాడితే మీరు ఉద్యోగాలు పొంది మీ నలుగురు కోసమేనా ఈ 1500 వందల మంది బలిదానం అని ప్రశ్నించారు.

నిరంతర ప్రక్రియ అంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరించి అధికార మదం తో కన్నుమిన్ను కానకుండా కండ్లకు కొవ్వేక్కినట్లు తెరాస నేతలు మాట్లాడుతున్నారని ఉద్యోగాలను భర్తీ చేయాలనీ 47%. ఖాళీలు పెట్టుకొని నువ్వు పాలన యెట్లు చేస్తావని కెసిఆర్ ను ప్రశ్నించారు శ్రవణ్.

తెలంగాణ వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి , చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులు తాము ఉద్యోగాలు కల్పించారని తెలిపారు.తెరాస పార్టీ కెసిఆర్ కేటీఆర్ లు తెలంగాణ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగని కానీ ఉన్న ఉద్యోగాలను తీసిపడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.కరోనా పేరు చెప్పి చైతన్య నారాయణ లాంటి అధ్యాపకుల నోట్లో మట్టి కొడుతుంటే వారిని ఆదుకునే నాథుడులేడని దుయ్యబట్టారు.కాగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఆదర్శ రైతు వ్యవస్థను ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను రద్దు చేసి వారి నోట్లో మట్టి కొట్టారని ఆవేదన వ్యక్తం చేసారు
కాంగ్రెస్ కేవలం పదివేల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని దుష్ప్రచారం చేస్తుందని కేవలం 2008,2010 లో వేసిన డీఎస్సీ తో నే నలభై వేల ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు.అదేవిధంగా గ్రూప్-1,గ్రూప్-2,గృప్ -3 లాంటి అనేక ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ముందుండేదని తెలిపారు.

అదేవిధంగా రాహుల్ గాంధీ ఐ టి ఆర్ పేరిట 50 లక్షల ఉద్యోగాలు కల్పనకు ప్రతిపాదిస్తే మీరు అధికారం లోకి వచ్చిన తరువాత భేషజాలకు పోయి దాని నిర్వీర్యం చేసారని కేవలం 13 వేల కోట్లు కేటాయిస్తే యాభై లక్షల ఉద్యోగాలు లభించేవని అట్లాంటి ఉద్యోగాలను నిర్వీర్యం చేసిన మన మంత్రి గారికి ఏవిధంగా ఉత్తమ ఐ టి మంత్రి గా అవార్డు వచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు.
అమరవీరుల బలిదానాల ఫలితమే మీకు పదవిని అనుభవిస్తున్నారని 1200 మంది అమరవీరుల కు ఒక్కరికి కూడా ఉద్యొగం లభించలేదని కానీ మీ కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు లాంహించాయని అన్నారు.

ప్రస్తుతం రెండులక్షల ఖాళీలు మరో లక్షా ఇరవై వేల కాంట్రాక్టు ఉద్యోగాలు ఇంకా కొత్త జిల్లాలు మండలాలకొరకు మరో లక్ష ఉద్యోగాలు మొత్తం నాలుగు లక్షల ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

ఓ వైపు కొత్తనియమాకాలు చేపట్టకుండా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుకుంటున్నారని మండ్రేగా లో పదివేలమంది సూపర్ వైజర్ లను తొలగించి వారి కుటుంబాల కడుపుకొట్టారని ఇంకా రాష్ట్రం లో 20 వేల రేషన్ డీలర్ల కు సరైన వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేసారు.ట్రాన్స్కో లో కొన్ని ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తే కొత్త ఉద్యోగాలను కల్పించినట్టు కాదని దాసోజు అన్నారు.తెలంగాణ ఆవిర్భవించినపుడు తెలంగాణా గుండెకాయ లాంటి సింగరేణి లో 65 వేల ఉద్యోగాలు ఉండేవని అక్కడ ప్రస్తుతం 45 వేల ఉద్యోగులే పని చేస్తున్నారని మిగతా ఉద్యోగాలు ఎటు పోయాయని ప్రశ్నించారు.రాష్ట్రం లోని ఎస్సీ,ఎస్ టి,బీసీ ,మైనారిటీ కార్పొరేషన్ లకు నిధులు కేటాయించక లక్షలాది అప్లికేషన్ లు పెండింగ్ లో పడిపోయాయని నిరుద్యోగులకు వాటి నుంచి కూడా ఉపాధి కలగకుండా చేసారని అన్నారు.ట్రాన్స్కో,జెన్కో లాంటి సంస్థల్లో గత 10,15 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న వారిని రెగ్యూలరైజ్ చేసి కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు భ్రమ కల్పించడం మీకేచెల్లిందని దాసోజు అన్నారు.

తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ అని హెచ్చరించి ఉద్యోగాల భర్తీ చేయకుంటే మిమ్ములను ఇంకా మీ పల్లకీలను మోసే మీ ఎమ్మెల్యే లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.ఇంట్లో దాకున్నంత మాత్రాన చర్చకు రానంతమాత్రాన మిమ్ములను వదలమని పిల్లి కళ్ళుమూసుకొని పాలుతాగినట్టు మీ వ్యవహారం ఉందని మిమ్ముల్ని నడిరోడ్డుపైకి ఈడ్చేరోజు వస్తుందని అమరవీరుల స్తూపం సాక్షిగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *