ఉద్యోగాలు భర్తీపై మా లెక్క
తప్పని నిరూపిస్తే గన్ పార్క్ వద్ద
గొంతుకోసుకుంటా: దాసోజు శ్రవణ్

లక్షల రూపాయల జీతం వదులుకొని, సామాజిక తెలంగాణ సామాజిక న్యాయం అనే సిద్ధాంతంతో తాను రాజకీయాల్లోకి వచ్చాను. తెలంగాణకు వ్యతిరేకమని చిరు, పవన్‌లనే వద్దనుకున్నా. ఈ గొట్టం గాని కోసం, 2009లో కేటీఆర్ నా ఇంటికి రెండు సార్లు వచ్చాడు. గల్లీల్లో తిరిగే ఆకు రౌడీ, తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన ఆలుగడ్డల శ్రీనివాస్ కి నిరుద్యోగ యువత బాధలు ఎలా తెలుస్తాయి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ భిక్షగాడు తలసాని. నేను గొట్టంగాన్నో.. సీఎం కేసీఆర్‌ని అడుగు ఆలుగడ్డల శ్రీనివాస్. 2014లో కెసిఆర్ తో 4గంటల పాటు మానిఫెస్టో పై టీవీ చర్చలో ఉన్న. ఆకురౌడీ,చిల్లర రౌడీ తలలేని మంత్రి తలసానిని నాపై ఉసికొల్పితే బెదిరేవాడు ఎవడులేడు. ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మీ భరతం పడతాము.కాంగ్రెస్ కేవలం పదివేల ఉద్యోగాలే భర్తీచేసిందనడం తప్పు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న మూడున్నర సంవత్సరాల కాలంలోనే 1.6 లక్షల ఉద్యోగాలు భర్తీచేశారు..అవి కూడా ఖాళీలు మాత్రమే భర్తీ చేయకుండా 84 వేల కొత్త ఉద్యోగాలు సృష్ఠించారు..మహాత్మా గాంధీ, తెలంగాణా, శాతవాహన యూనివర్సిటీల ద్వారా కాకుండా బాసర ట్రిపుల్ ఐటిల్లో వేల ఉద్యోగాలు సృష్టించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే స్కిల్ డెవలప్మెంట్ సంస్థను నెలకొల్పి, ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించారు. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధాని మోడీ ఓ బృందాన్ని రాష్ట్రానికి పంపి అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేడు అమలు చేస్తున్నారు. నేడు ఉద్యోగాలు కల్పించకుండా ఏ మొఖం పెట్టుకొని పట్టభద్రులను ఓట్లు అడుగుతారు. ఒక్కో ఓటుకు ఐదు వెల వరకు ఇవ్వడానికి వెనకాడడం లేదు. ఆ డబ్బంతా కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి పనుల్లో కమీషన్లే. బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో 1.92 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్టు పోస్టులు 1.20 కాగా నూతన జిల్లాల ఏర్పాటు వల్ల అవసరమయ్యే ఉద్యోగాలు కలిపి మొత్తం నాలుగు లక్షల ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలి. ఫార్మాసిటీ పేరుతొ భూములు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. గ్రేటర్ లో ఎన్నికలు అయిపోగానే వరదబాధితులకు సాయం అందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయి. నేను MA,MBA, PHD పూర్తిచేసి ప్రొఫసర్ గా పని చేశా. ఓ పేరున్న ఐ టి కంపెనీలో జీఎం గా పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉండేవాడిని. తెలంగాణ రాష్ట్ర సిద్ధికోసం తెలంగాణ ప్రజలకోసం లక్షల్లో జీతాలను వదిలి ఉద్యమంలో పాల్గొనడానికి రాజాజీయాల్లోకి వచ్చా. సామాజిక న్యాయం అనే సిద్ధాంతంతో తాను రాజకీయాల్లోకి వచ్చా. 2009లో తెలంగాణ ఉద్యమంలోకి వెళ్లినప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇంట్లో తాను కుటుంబసభ్యుడిని. వాళ్లింట్లో సొంత తమ్ముడిని చూసుకున్నట్లు చూశారు. అయినప్పటికీ వాళ్లు తెలంగాణకు వ్యతిరేకం అన్నప్పుడు.. వారిని తిరస్కరించి రోడ్ల మీదకు వచ్చాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తలసాని చంద్రబాబు సంక నాకుతూ తిరిగి, ఉద్యమానికి వెన్నెపోటు పొడిచే ప్రయత్నం చేశాడు. నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడితే మేము గొట్టం గాళ్లమా? సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ అన్నాడు. చివరకు తేలు కుట్టిన దొంగలా పారిపోయాడు. కేటీఆర్ తన పేరును తోక ముడిచిన తారక రామారావు అని మార్చుకోవాలి. ఆకు రౌడీ అయిన ఆలుగడ్డల శ్రీనివాస్ తో నన్ను కేటీఆర్ తిట్టించాడు. పైసలిచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని నన్ను గొట్టం గాడు అనేది..? నీ లెక్క పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమకారుల పార్టీలో తలసాని లాంటి లఫంగిలు చేరారు. నేను గొట్టంగాన్నో.. కాదో కేసీఆర్‌ని అడుగు. తెలంగాణ ఏర్పాటు కోసం నాడు తెరాస నుండి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ను ప్రో జయశంకర్ గారితో , విద్యాసాగర్ గారితో కలిసి రాశాము. నాడు తెరాస పొలిట్ బ్యూరో మెంబెర్ గా ఉన్నాను. 2014లో కెసిఆర్ తో 4గంటల పాటు టీవీ కార్యక్రమంలో మానిఫెస్టో పై చర్చలో పాల్గొన్న.చివరికి ఉద్యమకారులపై దాడులు చేసే ప్రయత్నం చేసిన ఆకురౌడీవి. నువ్వు ఉద్యోగ సమస్యల గురించి మాట్లాడటమేంటీ. కావాలంటే మోండా మార్కెట్‌లో ఆలుగడ్డల గురించిమాట్లాడుకోవచ్చు. తలలేని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఆకురౌడీ, చిల్లర రౌడీ పది ఫెయిల్ ఐన శ్రీనివాస్ యాదవ్ గతంలో కెసిఆర్ ముక్కు కోస్తా అన్నమాటలు మరిచిపోయాడు. ఉద్యోగాల భర్తీపై చర్చకు ప్రగతి భవన్ ,తెలంగాణ భవన్ లకు ఎక్కడికి రమ్మన్నా వస్తా.
తెలంగాణా కేసీఆర్ జాగీరు కాదు. కొట్లాడితెచ్చుకున్న తెలంగాణ. 2013 లో పార్లమెంటులో కేసీఆర్ ప్రకటించిన విధంగా బలిదానం కాబడ్డ 1200 మంది తెలంగాణ బిడ్డల కుటుంబాలకు వెంటనే పదిలక్షల చొప్పున పరిహారం ప్రకటించాలి. తెరాస , బీజేపీ పార్టీల పంచాయితీల నడుమ ఐ టి ఆర్ లను సర్వనాశనం చేసారు..2004 లో ఉన్న ఐ టి ఉద్యోగాలు ఎన్ని? మీరు అధికారం లోకి వచ్చిన తరువాత 2014 లో ఉన్న ఐ టి ఉద్యోగాలు ఎన్ని? ఇది పెన్షన్ల, రైతుబంధుల ప్రభుత్వమే. నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారు”.

– ఏఐసీసీ అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *