దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ స్టాంపు డ్యూటీ పెంచనున్న ప్రభుత్వం. ప్రజలపై ఏటా రూ.250 కోట్ల వరకు ఆర్థిక భారం.

అమరావతి: ఆస్తుల బదిలీ (దస్తావేజుల రిజిస్ట్రేషన్‌) కోసం వసూలు చేసే స్టాంపు సుంకాన్ని (డ్యూటీ) పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో సుమారు 25 నుంచి 30 రకాల స్టాంపు డ్యూటీలు అమల్లో ఉన్నాయి. దస్తావేజులోని ఆస్తి విలువ, రకాన్ని బట్టి 1% నుంచి 5% వరకు ప్రభుత్వం సుంకం వసూలు చేస్తోంది. ఇకపై వీటిని రెండు స్లాబుల (5%, 2%) కింద వర్గీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీపై అధ్యయనం చేస్తున్నారు. వీటిపై అధికారిక నిర్ణయం వెలువడితే ప్రజలపై ఏటా రూ.250 కోట్ల వరకు ఆర్థిక భారం పడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *