జూలై 3న ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష…

షెడ్యూల్ ను ప్రకటించిన ఐఐటీ-ఖరగ్పూర్

ఆంధ్ర ప్రదేశ్ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జాయింట్ ఎంట్రెన్స్ అడ్వాన్స్ డ్-2021 ఎగ్జామినేషన్ పరీక్షను జూలై 3న నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్ పూర్ షెడ్యూల్ ను ప్రకటించింది. జూలై 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 , మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. అయితే.. పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సి ఉంది కాగా, జేఈఈ మెయిన్స్ ను ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే లో ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి సెషన్ కు సంబంధించి ఫలితాలను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. నాలుగు విడతల పరీక్షలు ముగిశాక నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థుల్లో టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ డ్ కు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష అనంతరం ఐఐటీల్లో ఆర్కిటెక్చర్ కోర్సులకు.. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్ట్ (ఏఏటీ)ని నిర్వహిస్తారు. దీని తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

జేఈఈ మెయిన్ అభ్యర్థులకు సవరణల అవకాశం

కాగా, జేఈఈ మెయిన్స్ కు సంబంధించి మార్చి ఏప్రిల్, మే సెషన్ల కు దరఖాస్తు చేసినవారు సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎసీఏ) ప్రకటన విడుదల చేసింది. ఈ సెషన్లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు సిటీ సెషన్ కేటగిరీ సబ్జెక్టు తదితరాల్లో మార్పులు చేర్పులుంటే మార్చి 6లోగా చేసుకోవచ్చని వివరించింది. ఎన్టీఏ వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్టీఏ.ఏసీ.ఐఎన్’ లేదా ‘హెచీటీపీఎస్://జేఈఈమెయిన్.ఎన్ఏ.ఎన్ ఐసీ.ఐఎన్’ వెబ్ సైట్ల ద్వారా సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. జేఈఈ మెయిన్స్ కు అదనంగా మరో మూడు పరీక్ష కేంద్రాలను చేర్చింది. లడఖ్ లోని కార్గిల్, మలేషియాలోని కౌలాలంపూర్ నైజీరియాలోని అబుజా/లాగోస్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *