ఖమ్మం కార్పొరేషన్ టిఆర్ఎస్ పాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జిల్లా సీపీఎం నాయకులు వై విక్రమ్

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఆసక్తి నెలకొంది. ఖమ్మం కార్పొరేషన్లో టిఆర్ఎస్ పాలనా వైఫల్యాలపై జిల్లా సీపీఎం నాయకులు వై విక్రమ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏ ముఖం పెట్టుకొని కార్పొరేషన్ ఎన్నికల్లో TRS పార్టీ వారు ఓట్లు అడుగుతారని ప్రశ్నలు సంధించారు.

నగర ప్రజల్లారా టిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించండి.. ప్రజలు కోసం కేసులు ఎదుర్కుని నిజాయితీగా పోరాటం చేస్తున్న సీపీఎం పార్టీ అభ్యర్థులను గెలిపించిండని కోరారు.

కొత్త బస్టాండ్ నుంచి గోళ్ళపాడు ఛానల్ వరుకు భారీ స్ధాయిలో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలి…

నగరం అంతా “షో” అభివృద్ధే… అసలు ప్రజలకు కావలసిన మోలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో టిఆర్ఎస్ విఫలం అయ్యింది…

1800 డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేయడానికి 7 సంవత్సరాలు పడితే.. మిగతా 6 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎప్పుడూ పూర్తి కావాలి..?

మామిళ్ళ గూడెం – సారధి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పరిస్థితి ఏమిటి..?
కాల్వడ్డు బ్రిడ్జి పరిస్థితి ఏమిటి..?
కొత్త పెన్షన్ లు ఇవ్వారా…?
కొత్త రేషన్ కార్డులు ఇవ్వారా..?
శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేయారా..?

కొత్త బస్టాండ్ వుండాలి.. జిల్లా ప్రజల అవసరాల దృష్ట్యా పాత బస్టాండ్ ను లోకల్ బస్టాండ్ గా కొనసాగించాలి…
రోడ్ లు ఎక్కడా…
అండర్ డ్రైనేజీ ఎక్కడా…
గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడా…
ప్రభుత్వ ఆసుపత్రిలో ASI ఎక్కడా…
నగరంలో కరోనా పేటెంట్ లను పట్టించుకొనే నాధుడే లేడు…
ఖమ్మం టిఆర్ఎస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఇక రాష్ట్ర స్థాయిలో కూడా TRS హామీలు అమలు కాలేదని విక్రమ్ అన్నారు.

ఇలా చాలా సమస్యలు ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి…
అందుకే సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి, నిరంతరం ప్రజలతో వుండే CPM అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *