AP: కడప ఎంపీ అవినాష్ రెడ్డి పెదనాన్న అరెస్ట్..

కడప ఎంపీ (వైఎస్సార్సీపీ) వైఎస్ అవినాష్ రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.  రెండు రోజుల క్రితం, కడప జిల్లాలోని మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనిలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో దాదాపుగా పది మంది కూలీలు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో అనూహ్యంగా ఒక కీలక వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనం కలిగిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి పెదనాన్న అయిన ప్రతాప్‌రెడ్డి. వైఎస్ కుటుంబానికి చెందిన ప్రతాప్ రెడ్డి ఈ కేసులో అడ్డంగా దొరికిపోవటంతో, తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో, ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈయన అరెస్ట్ కు ప్రధాన కారణం, జిలెటన్‌ స్టిక్స్‌ సప్లయ్ చేయటం. మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనిలో ఉపయోగించిన, జిలెటన్‌ స్టిక్స్‌ ని పులివెందుల నుంచి, వైఎస్ ప్రతాప్ రెడ్డి తీసుకుని వెళ్లినట్టు, ఆధారాలు లభించడంతో, పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

పులివెందులలోని వైఎస్ ప్రతాప్ రెడ్డికి చెందిన మ్యాగజైన్ లైసెన్స్ నుంచి ఈ జిలెటిన్ స్టిక్స్ ని తీసుకెళ్లినట్లు విచారణలో వెలుగు చూసింది. ఎలాంటి జాగ్రత్త చర్యలూ తీసుకోకుండా పేలుడు పదార్థాలను తరలించటం వల్లే ప్రమాదం జరిగినట్లు తేల్చిన పోలీసులు అందుకు బాధ్యుడైన ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. వైఎస్ ప్రతాప రెడ్డికి, కడపలోని అనేక ప్రాంతాల్లో గనులు ఉన్నాయని. అక్కడ ఉపయోగించే జిలెటన్‌ స్టిక్స్‌ను, ఆయనకు ఉన్న మ్యాగజైన్‌ లైసెన్స్‌ ఉపయోగించి, ఈ జిలెటన్‌ స్టిక్స్‌ను మామిళ్లపల్లె గనులకు తరలించారు. అయితే ఈ క్రమంలోనే, అక్కడ సరైన ఏర్పాట్లు చేయక పోవటం, ఇష్టం వచ్చినట్టు అన్ లోడ్ చేసే క్రమంలో, పెద్ద పేలుడు సంభవించింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న కూలీలు పది మందికి పైగా చనిపోయారు. ఇక్కడ గని యజమాని అయిన నాగేశ్వర్‌రెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా, పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వార్త అవ్వటం, ప్రతిపక్షాలు ఆందోళన చేయటంతో, అరెస్ట్ చేయక తప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *