మొన్న కురిసింది- నేడుకూలింది…
విక్రమ్ సీపీఎం ఖమ్మం నేత

ఇటీవల ఖమ్మంలో నిర్మించిన కొత్త బస్టాండ్ ను సిపిఎం ఖమ్మం జిల్లా నేత వై విక్రమ్ సందర్శించారు. ప్రజల సొమ్ముతో 25 కోట్లు వెచ్చించి నిర్మించిన ఖమ్మం కొత్త బస్టాండ్ ఒక్క వాన తోటే అసలు స్వభావం బయట పడింది అని అన్నారు. ప్రభుత్వాధినేతలు ఈ బస్టాండ్ ని RTC చరిత్రలో కలికితురాయి, హైటెక్ బస్టాండ్  అన్నారు. తెలంగాణలో నెంబర్ టూ అని గొప్ప మాటలు చెప్పారని, నిర్మాణంలో నాణ్యత శూన్యం అని విమర్శల వాన కురిపించారు. నాసిరకం పనులపై విచారణ జరిపించి అధికారులపై, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని విక్రమ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *