కరోనా పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం… మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్ గారి ప్రెస్ మీట్…. పాయింట్స్

బుధవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కీలక సమావేశం సచివాలయంలో జరిగింది. కమిటీ ఛైర్మన్‌, మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌తో పాటు సీఎంవో ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణలో తీవ్రత తగ్గిందని ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న హోం ఇసోలేషన్ మందుల నిల్వలో ఎలాంటి కొరత లేదు. ఇంటి ఇంటికి సర్వే చేస్తూ… అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నాం. రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయింది. ఇప్పటి దాకా 2.1 లక్షల కిట్స్ ఇచ్చాము. ప్రభుత్వము చేస్తున్న ప్రయత్నం వలన వేలాది మందిని కాపడగలము… ఈ మందులను కోవిడ్ లక్షణాలు రాగానే ఈ మందులు వాడడం వలన సీరియస్ కండిషన్ లో హాస్పిటల్ అవ్వాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది… ఈ ప్రయత్నం పలితాలు ఒకటి రెండు రోజుల్లో కనిపిస్తుంది అన్న ఆశాభావం ఉన్నది. రాష్ట్రంలో బెడ్స్ భారీగా పెంచాము…. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు లో ఆసుపత్రులు సైతం భారీగా పెరిగాయి.  Remdesivir లాంటి మందుల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 Lacs ఇంజెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంజెక్షన్లు తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయము చేస్తాము. దీంతో పాటు ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ వినియోగం పైన వివరాలు తీసుకుంటున్నాము. వీటి వినియోగం పైన ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తాం.

వీటితో పాటు రోగులు సీరియస్ గా అరుదుగా, అత్యవసరంగా వాడుతున్న టోలిసిజుమాబ్ వంటి మరిన్ని మందుల సరఫరా కూడా సరిపడేలా చూసుకోవాలని సూచన. ఆక్సిజన్ సప్లై గురించి కూడా చర్చించాము, ప్రస్తుతానికి అవసరము అయిన డిమాండ్- సప్లై పైన వివరాలు తీసుకున్నాము.  కోవిడ్ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచన.

జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు… మంత్రులు చేస్తున్న పర్యవేక్షణ చర్యలతో సమన్వయం అధికారులకు సూచించాము 

వ్యాక్సిన్… 

• రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షలు గా ఉన్నది. ఇందులో ఇప్పటికే 38 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. వీరిలో 7.15 లక్షల మందితో పాటు  3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నారు. మొత్తంగా 10 లక్షలకు పైగా జనాభా పూర్తి వాక్సిన్ తీసుకున్నారు. వాక్సిన్ ప్రజలకు అందించెందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ప్రారంభించింది. రానున్న రోజుల్లో కరోనాకి చికిత్సకు అవసరమైన మందుల తయారీ దారులతో పాటు… వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం అవుతాము. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేందుకు కైనా సిద్ధంగా ఉన్నాము. ఇతర రాష్ట్రాల పరిస్థితులతో పోలిస్తే తెలంగాణలో మంచి పరిస్థితి ఉంది.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల సత్ఫలితాలను ఇస్తున్నాయి… ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా గుర్తించింది…. కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ మేరకు అభినందించారు. ఎప్పటికప్పుడు కరోనా కట్టడికి చర్యలను ముమ్మరం చేస్తున్నాము…. మరింత సమగ్రంగా కార్యాచరణ తీసుకుని ముందుకు పోతాం. టాస్క్ ఫోర్స్ సమావేశాలు వరుసగా కొనసాగే ఒక సమగ్ర కార్యాచరణ దిశగా ముందుకుపోతాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *