కొత్త వ్యవసాయక చట్టాలు -భూయాజమాన్యంలో వ్యత్యాసాలు

భారతదేశ  ఆర్థిక వ్యవస్థ శతాబ్దాలుగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. మెరుగైన సాంకేతిక విద్య అందుబాటులోకి రావడం వలన ఈ ధోరణి సర్వీస్డ్ బేస్డ్ ఎకానమీ వైపు మారింది . వ్యవసాయ రంగంలో ఉన్న అసమానతలను పరిష్కరించకుండానే ఈ మార్పు జరిగింది. 2010-2011 మరియు 2015-16 వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో మొత్తం పంట విస్తీర్ణం 2011 లో దాదాపు 243M హెక్టార్ల నుండి 2016 లో 284M హెక్టార్లకు పెరిగింది. ఇదే లెక్కల ప్రకారం దేశంలోని 16.63% దళితులకు  కేవలం  9% వ్యవసాయ భూమి మాత్రమే ఉంది.

దేశంలో అతి ఎక్కువ దళిత జనాభ  పంజాబ్, హర్యానాలలో ఉన్నా వారికి అతి తక్కువ భూమి ఉంది.  2015-16 ఈ వాటా మెరుగుపడలేదు,దాదాపు అదే విధంగా ఉంది. మిగితా రాష్ట్రాలు కొంత మెరుగ్గా ఉన్నా 2015 – 16 లో ఈ సంఖ్య క్షిణించింది.

జమీన్ ప్రాప్తి  సంఘర్ష్ కమిటీ (జెడ్పిఎస్సి) పంజాబ్లో ఈ  అంతరాన్ని పరిష్కరించడానికి ఏర్పడిన యూనియన్. చాలా కాలంగా ఉన్న కుల ఆధిపత్యం ఈ అంతరానికి  కారణం అని యూనియన్ ప్రతినిధి గురుముఖ్ సింగ్ అన్నారు. “మాకు చెందిన భూమి ధనిక, ఉన్నత కులాల వారి దగ్గర ఉంది. వారు వ్యవస్థలో పదవుల్లో ఉన్నా ఈ వ్యత్యాసాన్ని అంతం చేయడానికి ఇష్టపడరు. 55 గ్రామాల్లో 20000 రూపాయలకు షామ్లాట్ భూములకు వేలం వేశాం. ఇప్పుడు ప్రజలు సంయుక్తంగా వ్యవసాయం చేయగలుగుతున్నారు. భూమిలేని దళితుల కోసం కేటాయించిన మూడవ వంతు షామ్లాట్  భూములను కొన్ని ప్రదేశాలను ఆక్రమించుకుంటున్నారు ”

విలేజ్ కామన్ ల్యాండ్ (రెగ్యులేషన్) నిబంధనలు, 1964 ప్రకారం, షామ్లాట్ భూములు గ్రామ పంచాయతీకి చెందినవి. పంజాబ్ గ్రామాల్లోని మూడు రకాల సాముదాయక భుములలో షామ్లాట్ ఒకటి. పంజాబ్లో 1,70,033 ఎకరాల షామ్లాట్ భూమి ఉంది. దీనిని ప్రధానంగా సాగుకు ఉపయోగిస్తారు.

ప్రతి సంవత్సరం గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ శాఖ నిర్వహిస్తున్న బహిరంగ వేలం ద్వారా దీనిని కేటాయిస్తారు. సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయడానికి పంచాయతీలకు పారిశ్రామిక గృహాలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు మరియు సంస్థలకు షమ్లాట్ భూమిని విక్రయించడానికి అనుమతించే ఈ చట్టానికి 2020 జనవరిలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

“మా కమిటీ అధ్యక్షుడిపై 32 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయి. ఈ కమిటీలో 200 మందికి పైగా మహిళలు పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సరిహద్దుల వద్ద ఆశ్రయాలు, జెండాలతో నిరసన తెలపడానికి రైతులకు అనుమతి ఉంది. భూమిలేని రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఈ పక్షపాతాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ” అని గురుముఖ్ సింగ్ అన్నారు.

ఎక్కువగా హర్యానా, పంజాబ్కు చెందిన రైతులు  మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎనమిది  నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు,Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Act, 2020; Essential Commodities (Amendment) Act, 2020; and Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance మరియు Farm Services Act, 2020.

సాంఘిక-ఆర్థిక కుల జనాభా లెక్కల 2011 ప్రకారం, చాలా రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్  కుటుంబాలలో ఎక్కువ మంది సాధారణ శ్రమలో (casual labour) పాల్గొన్నారు. బీహార్, తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని 80 శాతం కుటుంబాలు సాధారణ  శ్రమ నుండి తమ ప్రధాన ఆదాయాన్ని పొందుతున్నాయి. పంజాబ్ ,హర్యానాలో, సాధారణ శ్రమ పై   ఆధారపడిఉన్న షెడ్యూల్డ్ కులాల  మరియు   ఎస్సీ / ఎస్టీయేతర వర్గాల (non sc/st) కుటుంబాల వారి  మధ్య ఇతర రాష్ట్రాల కంటే తేడా ఎక్కువగా ఉంది. మరోవైపు, బీహార్ మరియు తమిళనాడులో రెండు సామాజిక వర్గాలలో ఈ శ్రమ లో పాల్గొంటున్నవారి శాతం అధికం.

ప్రధానంగా వ్యవసాయ కార్మికులుగా ఉన్న భూమిలేని దళితులు కూడా నిరుద్యోగానికి భయపడి నిరసనలో చేరారు. వారిని పంజాబ్ నుండి జెడ్పిఎస్సి భారీ ఎత్తున సమీకరించింది. మరోవైపు, హర్యానాకు చెందిన భారతీయ కిసాన్ పంచాయతీ (బికెపి), జనాన్ని సమీకరించింది.

బికెపి ప్రతినిధి సచిన్ పుగ్తాలా మాట్లాడుతూ “ఇక్కడి దళితుకు  భూమిలేదు. ఇది వారిలో ఆత్మనూన్యతాభావం కలిగిస్తుంది . హర్యానాలోని రైతు సంఘాలలో వారికి పెద్ద పాత్ర లేదు. ఈ విషయం గురించి ఆలోచించడానికి యూనియన్ సభ్యులలో కూడా అలాంటి అవగాహన లేదు. పంజాబ్ లో ఈ సమస్య గురించి  అనేక పోరాటాలు జరిగాయి. కానీ హర్యానా ఇటువంటి ఆందోళనలకు చూడలేదు. నా లాంటి యువ సభ్యులు ఈ సమస్యను గుర్తించి దాని కోసం పనిచేయాలని కోరుకుంటారు. హర్యానా వంటి ప్రదేశంలో ఇది సవాళ్లతో కూడిన పని . ”

 ఎస్సీ / ఎస్టీయేతర వర్గాల మొత్తం పంట విస్తీర్ణం 2010-2011 లో  190.03M హెక్టార్ల నుండి 2015-2016 లో 230.14M హెక్టార్లకు గణనీయంగా పెరిగింది.  దేశంలో ఎస్సీల పంట విస్తీర్ణం 21.35 M హెక్టార్ల నుండి 25 M హెక్టార్లకు, ఎస్టీల పంట విస్తీర్ణం 21.85M హెక్టార్ల నుండి 26.98 M హెక్టార్లకు పెరిగింది

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బిఎస్పి అధినేత మాయావతి తన పదవీకాలంలో, మొదటి నాలుగేళ్లలో  భూమిలేని  2.67 లక్షల ప్రజలకు  58,000 హెక్టార్ల వ్యవసాయ భూములను పట్టాలుగా రాష్ట్ర  ప్రభుత్వం కేటాయించింది. 1.60 లక్షల మంది దళితులు ఇదే పంపకం కింద లబ్ది పొందారు. (ఇండియన్ ఎక్సపర్స్ రిపోర్ట్ )

మన తెలంగాణాలో 15 .44 శాతం(2011) దళితులు 9 శాతం భూమి మాత్రమే ఉంది.ఇటీవలే జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం కొత్త పథకాన్ని కూడా ప్రకటించింది. ప్రతి నియోజక వర్గంలోదారిద్రయ రేఖకు దిగువన ఉన్న 100 మంది దళిత కుటుంబాలు తమ బ్యాంకు ఖాతాల్లోకి 10 లక్షలు అందుకుంటారు. దళితుల స్వాధీనంలో ఉన్న భూమిని లెక్కించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం 2014 లో పేద భూమిలేని దళిత మహిళలకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి  దళితుల భూమి కొనుగోలు పథకాన్ని ప్రారంభించింది. భూమితో పాటు ఈ పథకం కింద సమగ్ర ప్యాకేజీ ఇవ్వబడుతుంది.ఇందులో నీటిపారుదల సౌకర్యాలు, విత్తనం, సాగు వ్యయం, ఎరువులు, పురుగుమందులు, దున్నుట, పంపుసెట్లు మొదలైనవి, ఒక పంట సంవత్సరానికి అదనంగా భూమి అభివృద్ధికి, తయారీకి నిధులు సమకూర్చడం. నర్సరీ మరియు వ్యవసాయ ఇన్పుట్ల. సాగు ఖర్చులను తీర్చడానికి సంబంధించిన మొత్తాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి బదిలీ చేయబడతాయి.

2014 మొదలుకొని ఇప్పటివరకు సుమారు 756 కోట్ల వ్యయంతో  16906 ఎకరాలను  కొనుగోలు చేసి  6874  ప్రజలకు ఈ పధకం కింద భూమిని ప్రభత్వం పంపిణి చేసింది . ఒక ఎకరానికి సగటున 4-5 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. ఈ ధరకి నాసిరకం భూమి కొనుగోలు చేసి పంచుతున్నారని గట్టిగా విమర్శలు వినిపించాయి.
కేంద్రం 2015-16 నుండి 2021 -22 బడ్జెట్లో సామాజిక న్యాయం కింద సగటున 8 వేల కోట్లను కేటాయించింది.

గ్రామాల్లోని అర్హతగల ఎస్సీ కుటుంబాలు, వెనుకబడిన తరగతి (కేటగిరీ-ఎ) కుటుంబాలు ,బిపిఎల్ కుటుంబాలకు ఉచిత నివాస ప్లాట్లు కేటాయించడానికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ బస్తీ యోజన 2008-09 ను ప్రారంభించింది. 2014 లో 464 దళిత కుటుంబాలకు 42 ఎకరాల నివాస స్థలాన్ని కేటాయించారు. వీటిలో కొన్ని ప్లాట్లను ఉన్నత కుల వర్గాల వారు ఆక్రమించారు. కేసు నమోదు చేసి, 2017 లో లబ్ధిదారులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది.

అమన్ప్రీత్ , ఛత్రా ఏక్తా మంచ్ (సిఇఎం) విద్యార్థి కార్యకర్త. ఇది విద్యార్థులు,ఎక్కువగా దళితులు నడుపుతున్న సంఘం. అతను . హర్యానా రాష్ట్రంలో హిసార్  కు చెందినవాడు. భూమిలేని దళితులలో ఒకరు. ఆయన మాట్లాడుతూ “హిసార్లో కుల దురాగతాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. భూమి ఉన్నవాడు, లేనివాడితో  ఉన్నత కులాల వారు భిన్నంగా వ్యవహరిస్తారు. ఖాప్ పంచాయతీలతో పెద్ద సంఘాల నాయకులకు సంబంధాలు ఉన్నాయి. కుగ్రామ భూముల నుండి భూమిని క్లెయిమ్ చేయడానికి ఉద్యమం ఏ విధమైన ఆకృతిని తీసుకోకపోవడానికి ఇది ఒక కారణం. ”

 2022 అసెంబ్లీ ఎన్నికలకు SAD మరియు BSP  జూన్ 6 న కూటమి గా ఏర్పడింది. ఇందులో SAD 97 సీట్లతో మరియు BSP 20 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.వ్యవసాయ చట్టాల సమస్యలపై, SAD భారతీయ జనతా పార్టీ (BJP)తో తన కూటమిని రద్దు చేసింది. SAD  తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఒక దళితుని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తామని ఇప్పటికే పేర్కొంది.

బిఎస్పి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కేటాయించిన సీట్లలో సుమారు మూడింట రెండు వంతులు ఉన్నాయని గురుముఖ్ సింగ్ చెప్పారు.” చాలా సమయం నుండి BSP ఈ సీట్లలో కొన్నింటిలో పోటీ చేయలేదు. ఇది పంజాబ్ లోని దళిత సమాజానికి ద్రోహం.”

BSP రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి  Dr మఖన్ సింగ్ ఈ కూటమిని ‘అపవిత్రం’ అని పిలిచారు “మంత్రివర్గంలో దళిత సభ్యులు ఉంటేనే ఈ రైతుల పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. చాలా మంది ముఖ్యమైన సీనియర్ నాయకులను సంప్రదించకుండా ఈ కూటమి ఏర్పడింది. SAD  కి  జాట్ల నుండి పెద్ద ఎత్తున  మద్దతు ఉంది వారు దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతారు అలాంటిది BSP కి ఎందుకు  ఓటు వేస్తారు?, అని ప్రశ్నించారు

ఈ కూటమి అనుకున్న విజయం సాధిస్తే పంజాబ్ లోని ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది అనుకునే సమయం లో అదే వర్గానికి చెందిన వారు వ్యతిరేయించడం గమనార్హం.

ఇండియా డేటా పోర్టల్ నుండి విజువలైజేషన్ ఉపయోగించి న్యూస్ లాండ్రీ మరియు ఇండియా డేటా పోర్టల్ ఫెలోషిప్ లో భాగంగా ఈ కథ వ్రాయబడింది

*కేరళ, గుజరాత్ మరియు బీహార్ వంటి రాష్ట్రాలు భూ వాట ~ 2.5% శాతం ఉంది. అయితే తక్కువ దళిత  జనాభా శాతం లేదా అన్ని వర్గాల వారీగా పెద్ద సంఖ్యలో ఉపాంత భూములు వంటి కారణాల వల్ల పరిగణించలేదు.

ఏటికల భవానీ, రచయిత
‌‌ (Etikala Bhavani)

One Reply to “కొత్త వ్యవసాయక చట్టాలు -భూయాజమాన్యంలో వ్యత్యాసాలు”

  1. Good job Bhavani keep it up. What I felt is, now you are more studious than when you were a student 😀😀😀۔

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *