AP News: అనంతపురం జిల్లా టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టపర్తికి వెళ్తున్న మరూర్ టోల్ గేట్ వద్ద పోలీసులు జేసీ ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. జేసీ పుట్టపర్తికి వెళ్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ విషయమై పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాను ఉజ్వల విల్లాల విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి వస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మరో వైపు పుట్టపర్తికి జేసీ ప్రభాకర్ రెడ్డి రాకను నిరసిస్తూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నేతృత్వంలో స్వంత పార్టీ వారే నిరసనకు దిగారు.
పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు భారీగా పుట్టపర్తిలో మోహరించడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించి జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయమై పోలీసులు ఏ రకమైన నోటీసు ఇస్తారనే విషయమై చూసిన తర్వాత స్పందిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.
Also Read: