ఆంధ్రప్రదేశ్ Kakinada: గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

Kakinada: గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోనే సర్వీస్‌ రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు స్పందిస్తూ.. మిస్‌ ఫైర్‌ జరిగి ఎస్సై మృతిచెందారని చెబుతున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాతే ఎస్సైది ఆత్మహత్యనా? మిస్‌ ఫైర్‌ జరిగి మృతిచెందారా? అనేది తేలనుంది.

నిన్న సీఎం బందోబస్తు కి వెళ్ళి వచ్చిన ఎస్ ఐ గోపాలకృష్ణ రాత్రి ఇంట్లో గన్ తో కాల్చుకున్నాడు. గోపాలకృష్ణది విజయవాడ దగ్గర జగ్గయ్య చెరువు సొంత ఊరు. 2014 సంవత్సరం బ్యాచ్ లో ఎస్ఐగా సెలక్ట్ అయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు గదిలో పిల్లలు, భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఏమై వుంటాయా అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.గతంలో కాకినాడలో ట్రాఫిక్ లో పని చేశారు గోపాల కృష్ణ. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...