Bojjala Gopala Krishna Reddy Passed Away: మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి (73) శుక్రవారం ఉదయం గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఉదయం గుండె పోటు రావటంతో కటుుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా… హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు విద్యార్ధి సమయం నుంచి సన్నిహితుడుగా ఉన్న బొజ్జల చంద్రబాబు నమ్మిన బంటుగా పనిచేశారు. టీడీపీ హయాంలో ఆయన పలు శాఖలకు మంత్రిగానూ పని చేసారు.
బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003, అక్టోబర్ 1న అలిపిరి వద్ద నక్సల్స్ క్లైమోర్ మైన్స్ పేల్చిన సమయంలో.. చంద్రబాబు తో పాటుగా బొజ్జల కూడా గాయపడ్డాడు. బొజ్జలకు ఇద్దరు పిల్లలు. కుమారుడు సుధీర్ రెడ్డి ఇప్పుడు శ్రీకాళహస్తి టీడీపీ బాధ్యతలు చూస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా బొజ్జల మంచి స్నేహితుడే.
Also Read…