ఆంధ్రప్రదేశ్ AP News: ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ.. చిక్కుల్లో వైసిపీ?

AP News: ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ.. చిక్కుల్లో వైసిపీ?

MLC Anantha Babu Driver Death: అధికార పార్టీకి ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉద‌య్ భాస్క‌ర్ బాబు కారులో డ్రైవ‌ర్ మృత‌దేహం ప్ర‌త్య‌క్ష‌మైంది. ఎమ్మెల్సీ వ‌ద్ద ఐదేళ్లుగా సుబ్ర‌మ‌ణ్యం డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. డ్రైవ‌ర్‌ను హ‌త్య చేశార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తుండ‌డంతో రాజ‌కీయ వివాదానికి తెర‌లేచింది. రంపచోడవరం నేత అనంత సత్య ఉదయభాస్కర్‌(అనంత బాబు)ను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం గ‌త ఏడాది ఎంపిక చేసింది.

స్థానిక సంస్థ‌ల్లో వైసీపీకి తిరుగులేని ఆధిక్య‌త వుండ‌డంతో ఆయ‌న ఎన్నిక లాంఛ‌న‌మైంది. దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడు అనంతబాబు. ఓదార్పు యాత్ర నుంచి వైఎస్‌ జగన్ వెన్నంటే న‌డుస్తూ అభిమానం సంపాదించుకున్నాడు. టీడీపీ హ‌యాంలో అత‌నిపై ప‌లు అక్రమ కేసులు పెట్టారు. తొమ్మిది రోజులు విశాఖ సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. మేనమామలైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు సైతం వైసీపీ నుంచి ఫిరాయించినా అనంతబాబు మాత్ర‌మే పార్టీని వీడ‌లేదు. ఆ విశ్వాస‌మే అత‌నికి ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌చ్చేలా చేసింది.

ఇప్పుడు అత‌ను చిక్కుల్లో ప‌డ్డాడు. త‌ద్వారా అధికార పార్టీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గురువారం ఉద‌యం సుబ్ర‌మ‌ణ్యాన్ని అనంత‌బాబు వెంట తీసుకెళ్లిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ప్ర‌మాదానికి గురైన‌ట్టు సుబ్ర‌మ‌ణ్యం త‌మ్ముడుకి ఎమ్మెల్సీ ఉద‌య్‌బాబు స‌మాచారం ఇచ్చాడు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు త‌న కారులోనే సుబ్ర‌మ‌ణ్యం మృత‌దేహాన్నికాకినాడకు తీసుకెళ్లి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించాడు. అనంత‌రం వేరే కారులో ఎమ్మెల్సీ వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇది ముమ్మాటికీ హ‌త్యే అని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు ద‌ర్యాప్తున‌కు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read…

Disha Encounter Case: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకం – సుప్రీంకు సిర్పూర్కర్ కమిషన్

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...