Air India – Tata Group: కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ఈరోజు టాటా గ్రూప్‌కు అప్పగించడంతో 69 ఏళ్ల తరువాత ఎయిరిండియా తిరిగి టాటాల చేతికి వచ్చింది. ఇకనుండి ఎయిరిండియా విమానాలు టాటా గ్రూప్ బ్రాండ్‌తో నడుస్తాయని అధికారులు తెలిపారు.
అయితే 2700 కొట్ల రూపాయలకే ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఎలా అంటే రూ.18000కోట్లకి టెండర్ వేసింది. ఇందులో అప్పుల రూపంలో రూ15300 కోట్లు, నగదు రూపంలో రూ2700 కోట్లు చెల్లిస్తారు.
SBI నాయకత్వంలో UBI,PNB,BOB ప్రభుత్వరంగ బ్యాంకులు టాటా వారికి అప్పు ఇవ్వటం ద్వారా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేస్తారు. ఎయిర్ ఇండియా నిర్వహణ కోసం టర్మ్ లోను, వర్కింగ్ కాపిటల్ కూడా ఈ బాంక్ లే ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో ఒక్కటి కూడా ప్రైవేటు బ్యాంకు లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అప్పు తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లు కొనుగోలు చేస్తున్నాయి.
Also Read…