జాతీయం ఎయిర్‌ ఇండియా అమ్మకంలో లక్ష కోట్ల కుంభకోణం?

ఎయిర్‌ ఇండియా అమ్మకంలో లక్ష కోట్ల కుంభకోణం?

  • రెండో భాగం

Air – India: ఏదైనా వస్తువు కొనాలన్నా, అమ్మాలన్నా ఈ కసరత్తు ఆ వస్తువు ధర నిర్ధారించటంతో మొదలవుతుంది. కానీ ఎయిర్‌ ఇండియా అమ్మకం విషయంలో అమ్మాలన్న నిర్ణయంతో మొదలైంది. ఇక్కడే కుంభకోణానికి పునాదులు పడ్డాయి. మొదటి భాగంలో ప్రస్తావించుకున్నట్లు 2018 నాటి అమ్మకం ప్రకటన ప్రకారం ఎయిర్‌ ఇండియాలో 76శాతం వాటాలు అమ్మాలి. కొనుగోలు సంస్థలు ముందుకు రావటం లేదన్న సాకుతో వంద శాతం అమ్మకానికి సిద్ధమన్నట్లు కేంద్రం ప్రకటించింది.

76 శాతం వాటాలు కొనుగోలు చేసే సంస్థ ఎయిర్‌ ఇండియాకు ఉన్న అప్పులో 70 శాతం వాటాను భరించాలి. కానీ అసలు కంపెనీ విలువ ఎంత, ఎంత విలువున్న సరుకును అమ్మకానికి పెట్టారు అన్నది మాత్రం గోప్యంగా ఉంచింది కేంద్రం.

2018 నాటికి రు.33392 కోట్లు అప్పు ఉంటే 2021 మార్చి నాటికి రు. 61562 కోట్లు. రెండేళ్లల్లో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంటుంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రస్తావించాలి. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదనల్లో పరస్పరం పొసగని విషయాలున్నాయి. ఓవైపున 2018లో అమ్మకం ప్రకటన విడుదలైనప్పుడు కొనుగోలుదారులెవ్వరూ ముందుకు రాలేదని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో సవరించిన షరతులతో 2020లో మరోసారి అమ్మకానికి రంగం సిద్ధం చేసింది.

కానీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2018లోనే కొనుగోలుదార్లు ప్రభుత్వాన్ని సంప్రదించటమే కాక కొన్ని వివరణలు కూడా కోరినట్లు తెలుస్తోంది. ఆ పత్రంలో 160 ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వం 160 ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఇందులో ఎయిర్‌ ఇండియాకు ఉన్న అప్పులెంత అన్న ప్రశ్నకు ఇచ్చిన వివరమైన సమాధానం ప్రకారం ఎయిర్‌ ఇండియా చెల్లించాల్సిన నికర బకాయిలు కేవలం రు. 24570 కోట్లు మాత్రమేనని వెల్లడిస్తోంది. అటువంటిది 2021 మార్చి నాటికి రు.61562 కోట్లకు అప్పు ఎలా పెరిగిందన్న ప్రశ్నకు సమాధానం లేదు.

ఈ అప్పులు తీర్చుటానికి కేంద్రం 62057 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని పార్లమెంట్‌ నుండి అనుమతి పొందింది. అంటే ఎయిర్‌ ఇండియాకు ఉన్న అప్పు మొత్తాన్ని కేంద్రం తన నిధులతో తీర్చింది. అంటే ప్రజల సొమ్ముతో తీర్చింది. అటువంటప్పుడు ఎయిర్‌ ఇండియా కంపెనీని అమ్మాల్సిన అవసరం ఏమిటి అన్నది ప్రశ్న.

పత్రికల్లో వచ్చిన వివరాలు ప్రకారం ఎయిర్‌ ఇండియాను కేవలం 18000 కోట్ల రూపాయలకు కొనుగోలుచేసింది. ఇందులో కూడా కేంద్ర ఖజానాకు టాటా చెల్లించిన ప్రత్యక్ష చెల్లింపులు కేవలం రు.2700 కోట్లు మాత్రమే. మిగిలిన రు.15300 కోట్లు ఎయిర్‌ ఇండియా చెల్లించాల్సిన అప్పు కింద బ్యాంకింగ్‌ సంస్థలకు జమ చేయాలన్నది కొనుగోలు ఒప్పందం సారాంశం.

ఓవైపున ఎయిర్‌ ఇండియా అప్పులు కోసం రు.62000 కోట్లు ఖర్చు పెట్టేందుకు కేంద్రం పార్లమెంట్‌ అనుమతి పొందిందినట్లు వార్తలు వచ్చాయి. కనీసం టాటా కంపెనీ 18 వేల కోట్లకే ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసిందనుకుంటే కొనుగోలు ఒప్పందం ప్రకారం రు.15300 కోట్లు అప్పు కింద జమ అవుతున్నప్పుడు కేంద్రం ఎయిర్‌ ఇండియా అప్పులు చెల్లించేందుకు 62 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేలా పార్లమెంట్‌ నుండి ఎందుకు అనుమతి పొందినట్లు? ఈ వివరాలన్నీ పరిశీలిస్తే గతంలో 76 శాతం వాటా అమ్మకానికి ప్రకటించిన ధరకే నేడు వంద శాతం కంపెనీన అమ్మేసింది. అంటే పాతి శాతం కంపెనీ వాటాలు ఉచితంగానే కొనుగోలుదారుకు కట్టబెట్టినట్లు స్పష్టమవుతోంది.

 
మరోవైపున కొనుగోలుదారు 15 వేల కోట్ల రూపాయలు అప్పు కింద బ్యాంకులు, ఇతర ఆర్థికసంస్థలకు చెల్లించినప్పుడు మిగిలింది 46 వేల కోట్లు మాత్రమే. అంటే కేంద్రం ఈ పేరుతో అదనంగా 15వేల కోట్ల రూపాయలు ఖజానా నుండి లాగేసింది. ఈ కథ అంతటితో ఆగలేదు. 61వేల కోట్ల అప్పులో సగం అప్పును కేంద్రం ప్రత్యేకంగా చేసిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కు బదలాయించింది. ఇలా ఈ ప్రత్యేక సంస్థ ఖాతాలో జమపడిన అప్పు 35000 కోట్ల రూపాయలు.

ఈ మొత్తం కేంద్రమే చెల్లించింది అనుకున్నా పార్లమెంట్‌ నుండి అనుమతి పొందిన వ్యయంలో దాదాపు సగం సొమ్ము ఇంకా కేంద్రం వద్ద మిగిలేఉంటుంది. కొత్త యజమాని ఎయిర్‌ ఇండియాను ఆధునీకరించటానికి లాభదాయకంగా మార్చటానికి పెట్టాల్సిన ఖర్చు కేవలం 20 వేల కోట్ల రూపాయలు. పార్లమెంట్‌ అనుమతితో సిద్ధం చేసిన సొమ్ముతో ఎయిర్‌ ఇండియాను ఆధునీకరించవచ్చు. కానీ ఈ సొమ్మును కూడా కొత్త యజమానికి బదిలీ చేయటానికి వీలుగా కేంద్రం వ్యూహం పన్నినట్లు ఆర్థికలావాదేవీల తీరు వెల్లడిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాలు పరిశీలిస్తే మోడీ పర్యవేక్షణలో షుమారు లక్ష కోట్ల కుంభకోణానికి బిజెపి తెరతీసినట్లు అర్థమవుతుంది. 

వ్యాసకర్త – కొండూరి వీరయ్య

Also Read…

మొదటి భాగం Air india: ఎయిర్‌ ఇండియా అమ్మకంలో లక్ష కోట్ల కుంభకోణం?

Virus: కొత్త ప్రమాదాలు? లక్షకు పైగా వెలుగు చూడనున్న వైరస్ లు

RELATED

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ నిషేధానికి ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ‌: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం, స‌హ‌కారంతోనే సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం సాధ్యం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ‌స్తువుల వాడ‌కానికి స్వ‌స్తి చెప్పాలి జూలై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ నిషేధం హైద‌రాబాద్, జూన్ 30: పర్యావరణానికి హాని...