Crime News: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. భూ సమస్యను పరిష్కరించడానికి వెళ్ళిన అధికారులపై ఓ వ్యక్తి దాడి చేసి పెట్రోల్ చల్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టేందుకు యత్నించాడు. గ్రామంలోని ఓ కాలనీకి వెళ్ళే దారి విషయంలో జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి తహశీల్దార్ అరిఫోద్ధిన్, ఎస్ఐ గౌతం, డి ఎల్ పి వో ప్రభాకర్, ఎం పి వో రామకృష్ణ రాజు వెళ్లారు.
అయితే ఈ దారి హద్దులు నిర్ణయించేది లేదని, ఇది తన భూమి అని అధికారులతో గ్రామానికి చెందిన చుక్క గంగాధర్ వాగ్వాదానికి దిగాడు. అంతే కాకుండా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ అధికారులపై స్ప్రే చేసి నిప్పంటించాడు. నేపథ్యంలో భయంతో ఎస్సై, తహశీల్దార్ పరుగులు పెట్టి ప్రమాదం నుంచి తప్పించుకోగా.. వారి వెంట వెళ్లిన ఎంపీఓ మాత్రం మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఎంపీఓ రామకృష్ణ రాజు తీవ్ర గాయాల పాలు కాగా…ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: