క్రైమ్ Trending: షర్ట్ విప్పితే గుట్టు వీడింది.. ఖంగుతిన్న పోలీసులు

Trending: షర్ట్ విప్పితే గుట్టు వీడింది.. ఖంగుతిన్న పోలీసులు

Hawala Money – Chennai: గంజాయి ముఠాను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహించారు పోలీసులు. కానీ కట్టలకు కట్టల నగదు దొరికింది. అవును.. చెన్నైలో భారీగా హవాలా మనీ పట్టుబడింది. ఒకేరోజు పెద్ద మొత్తంలో నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే ఆంధ్రా నుంచే చెన్నైకు తరలుతోంది ఈ హవాలా మనీ, చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ యువకుడి దగ్గర భారీగా నగదు పట్టుబడింది. షర్ట్‌ లోపల సుమారు రూ.30లక్షలు, బ్యాగ్‌లో మరో రూ.30 లక్షలు గుర్తించారు రైల్వే పోలీసులు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

అతను రాజమండ్రి నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్తున్నాడని..కానీ విజయవాడ నుంచి చెన్నైకి టికెట్‌ తీసుకున్నట్టు గుర్తించారు. రైళ్లలో హవాలా మనీ, గంజాయి, మద్యం స్మగ్లర్లను పట్టుకునేందుకు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా చేపట్టిన సోదాల్లోనే భారీగా నగదు పట్టుబడిందని, మనీని సీజ్‌ చేసి వారిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ మనీని ఎక్కడికి తరలిస్తున్నారు..? దీని వెనుక ఎవరున్నారన్నది తేల్చే పనిలో పడ్డారు.

Also Read…

AP News: స్టార్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖకు గ్రూప్‌-1 ఉద్యోగం…

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...