అంతర్జాతీయం Russia-America: రష్యాలో అధికార బదిలీకి అమెరికా ప్రయత్నించిందా ?

Russia-America: రష్యాలో అధికార బదిలీకి అమెరికా ప్రయత్నించిందా ?

Russian-America: పుతిన్ ఇక ఏ మాత్రం అధికారంలో కొనసాగరాదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ బహిరంగంగా పిలుపునిచ్చారు. ఈ దిశగా యూరోపియన్ దేశాధినేతలతో సంప్రదింపులు జరిపేందుకు వారం రోజుల యూరప్ పర్యటన జరిపారు బైడెన్. ఉక్రెయిన్ నెపంతో రష్యాపై సైనిక జోక్యానికి ఉన్న అవకాశాలు పరిశీలించడమే ఈ పర్యటన ఉద్దేశ్యం. వారం రోజుల పర్యటన ముగింపు సందర్భంగా పొలండ్ రాజధాని వార్సలో జరిగిన విలేకరుల సమావేశంలో బైడెన్ ముందుగా తయారుచేసుకున్న ప్రసంగ పాఠం పరిధి దాటి మాటాడటంతో అమెరికా అసలు వ్యూహం ఏమిటో బయటపడింది. ఉక్రెయిన్ పై దాడి గురించి ప్రస్తావిస్తూనే బైడెన్ ‘ భగవంతుడా ఈ మనిషి (పుతిన్) గద్దె దిగేలా చూడు’ అన్నారు.


ఈ మాట అన్నాక పక్కనే ఆయన కోసం ఎదురుచూస్తున్న ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లిపోయారు. బైడెన్ అమెరికాలో దిగటానికి ముందే అధ్యక్ష భవనం బైడెన్ వాఖ్య తో జరిగిన నష్టాన్ని పరిహరించే పని మొదలు పెట్టింది. పొరుగు దేశాలపై పుతిన్ సర్వాధికారాలు చాలాయించకూడదు అన్నదే ఆమెరికా అధ్యక్షుని భావన తప్ప పుతిన్ ను గద్దె దించడం లక్ష్యం కాదని అమెరికా అధ్యక్ష భవన ప్రతినిధి ఒకరు తెలిపారు. 


బైడెన్ యూరప్ పర్యటన ముగించుకుని అధ్యక్ష భవనం చేరాక నిజంగా రష్యాలో అధికారబదిలీ జరగాలని ఆశిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ఈ ప్రశ్నకు సమాధానంగా బైడెన్ అటువంటిదేమీ లేదని ప్రకటించారు. అయితే బైడెన్ ముక్తసరిగా ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని మీడియా తనవంతు చర్చకు తెరతీయటంతో అంతిమంగా బైడెన్ ‘ నేను కేవలం నైతిక ఆగ్రహాన్ని మాత్రమే వ్యక్తం చేసాను తప్ప నాకు అపుడు కానీ ఇపుడు కానీ అటువంటి ఉద్దేశ్యం లేద’ని మరింత వివరంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఒకవేళ నేను అలా మాటాడినా ఎవరూ నమ్మరు అని కూడా శెలవిచ్చారు. కానీ ఈ విషయాన్ని సర్ది చెప్పేందుకు పలు దేశాల దౌత్యవేత్తలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకేన్ మాటాడుతూ ‘ ఏ దేశంలోనూ ప్రభుత్వాలను మార్చటం మా లక్ష్యంగా లేదు. తమకు ఎటువంటి నాయకత్వం కావాలన్నది నిర్ణయం తీసుకోవాల్సింది రష్యా ప్రజలే’ అన్నారు. 


యూరోపియన్ యూనియన్ ప్రధాన దౌత్యవేత్త జోసెఫ్ బొరేల్ కూడా ఇంచు మించు ఇదే వాదన ముందుకు తెచ్చారు.

కానీ చారిత్రక వాస్తవాలు పరిశీలిస్తే ప్రభుత్వాలను గద్దె దించటం లేదా మార్చడం మా విధానం కాదన్న వివరణను వాదనను నమ్మడం కష్టమే అవుతుంది. 

బ్రిటన్ సీనియర్ జర్నలిస్ట్ నియాల్ ఫెర్గుసన్ అభిప్రాయం ప్రకారం బైడెన్ నోరు జారక ముందే ఆయన ప్రభుత్వంలో ఓ సీనియర్ అధికారి ” ఇపుడు మిగిలి ఉన్న ఏకైక మార్గం ఒక్కటే. పుతిన్ ను గద్దె దించటం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చే వరకు రష్యా అంతర్జాతీయ సమాజంలో అంతరానిదేశం గానే ఉంటుంది’ అని ప్రకటించారు.అయితే రష్యా పట్ల పశ్శిమ దేశాల అభిప్రాయం ఇపుడేదో ఉక్రెయిన్ పరిణామాల నేపధ్యంలో నే ఇలా ఆలోచిస్తున్నారని చెప్పటానికి తగిన ఆధారాలేమీ లేవు. కొన్ని పరిణామాలను చూద్దాం. 

మిఖాయేల్ మెక్ఫౌల్ 2012 – 14 మధ్యకాలంలో రష్యాలో అమెరికా రాయభారీగా పని చేసారు. ప్రపంచంలో పలు దేశాల్లో ప్రభుత్వాలను మార్చడానికి అమెరికా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిందన్న సంగతి పుతిన్ కు బాగా తెలుసు. దానికోసం అనుసరించే వ్యూహాలూ తెలుసు అన్నారు.


రష్యాలో ప్రభుత్వాలు మార్చడానికి అమెరికా సాగించిన ప్రయత్నాలపై ఈయన 2005 లో ఏకంగా ఓ పరిశోధనా పత్రాన్నే రాశారు. అటువంటి అధికారిని ఒబామా ప్రభుత్వం రష్యా రాయబారిగా పంపటం అప్పట్లో పలు విమర్శలకు కారణం అయింది. 


2011 లో రష్యన్ పార్లమెంట్ ఎన్నికల్లో పుతిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ స్వల్ప మెజారిటీ తో బయటపడింది. ఈ ఎన్నికల నిర్వహణ తీరుపట్ల అప్పటి అనెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాదు. ఆ సందర్బంగా హిల్లరీ ‘ మిగిలిన అన్ని దేశాల ప్రజలకు ఉన్నట్లే రష్యా ప్రజలకు కూడా తాము ఎన్నుకున్న నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆశించే హక్కు, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని కోరే హక్కు ఉన్నాయ’న్నారు. 


హిల్లరీ అలా మాటాడటం అంటే ప్రతిపక్షాలను ప్రజలను రెచ్చగొట్టడమే అని పుతిన్ విమర్శించారు. ప్రతిపక్షం చేసే పనులకు అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం తప్ప మరోటి కాదని కూడా పుతిన్ ధ్వజమెత్తారు. ‘ హిల్లరీ ప్రకటనల సారాంశాన్ని అర్దం చేసుకోలేనంత అమాయకులం ఏమీ కాదు’ అని కూడా పుతిన్ అన్నారు. 


హిల్లరీ ప్రకటన నేపధ్యంలో పుతిన్ కి వ్యతిరేకంగా కుట్ర జరిగే అవకాశం ఉందని పుతిన్ ఆందోళన చెందినట్లు మెక్ఫౌల్ అభిప్రాయపడ్డారు. హిల్లరీ ఇలా మాటాడటం అమెరికా విదేశాంగ నీతి పట్ల రష్యాకు ఇతర దేశాలకు ఉన్న అనుమానలాను మరింత ధృవీకరించేదిగా ఉందన్నారు. 


2009 లో బారక్ ఒబామా ప్రభుత్వం ప్రతిపాదించిన రష్యాను దారికి తెచ్చుకోవడం అన్న విధానరూపకర్త మెక్ఫౌల్ అన్న వాస్తవం తెలిసిందే. పుతిన్ తో అధికారం పంచుకుంటున్న మెద్వదేవ్ కు పట్టం కట్టాలన్నది ఈ వ్యూహ సారాంశంగా ఉంది. ఇందులో భాగంగానే అమెరికా పుతిన్ తో హాట్లైన్ కొనసాగించటానికి బదులు మెద్వేదేవ్ తో కొనసాగిస్తోంది. 


ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని కూడా గమనించాలి. ఒబామా ప్రభుత్వంలో బైడెన్ కూడా ఉప విదేశాంగ మంత్రిగా పని చేసారు. 


2011లో రష్యా పర్యటన సందర్బంగా పుతిన్ మళ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా ఉండటమే ఉత్తమమం అన్న అభిప్రాయాన్ని ప్రతిపక్ష నేతలతో జరిగిన సమావేశంలోనే బహిరంగంగా వెల్లడించారు. పుతిన్ స్థానంలో తానే ఉంటే 2012లో జరిగే ఎన్నికల్లో బరిలోకి దిగేవాడిని కాదని బైడెన్ అన్నట్లు అప్పటి ప్రతిపక్ష నేతల్లో ఒకరు నెమత్సోప్ తన బ్లాగ్ లో రాశారు. 2015లో ఈయన హత్యకు గురయ్యారు. 


ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో అమెరికా అనేక దేశాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర పన్నుతోందన్నది రష్యాకున్న అవగాహన. ఈం దిశగా అమెరికా, బ్రిటన్ లు తమతమ నిఘా సిబ్బందిని మాస్కోలోకి చొప్పించారు. తాజాగా బ్రిటన్ కు చెందిన అటువంటి నిఘా కార్యకలాపాలను రష్యా ప్రపంచం ముందు ఉంచింది. ఆ నిఘా వ్యవస్థ పేరు స్పైరాక్. అంటే మనదేశంలో ప్రతిపక్ష నేతలపై ప్రయోగించిన పెగసిస్ లాంటిదన్నమాట.


స్పై రాక్ ఉందంతం వెలుగు చూసిన తర్వాత విదేశీ నిధులతో నడిచే ప్రభుత్వేతర సంస్థల పై రష్యా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.విదేశీ నిధులు పొందే సంస్థలు రాజకీయకార్యకలాపాల్లో పాల్గొనాలంటే ప్రత్యేక రిజిస్ట్రేషన్ తోపాటు ప్రత్యేక అనుమతి కూడా తీసుకోవాలని రష్యా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆటువంటి జాబితాలో యుఎస్ ఎయిడ్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. అలా ప్రత్యేక జాబితాలో నమోదు చేసుకోని సంస్థల నుండి నిధులు సేకరణ ను ప్రభుత్వం నిషేధిస్తోంది.


ఇటువంటి చర్యలతో రష్యా పౌర సమాజ ప్రయోజనాలను కాపాడటం సాధ్యమయ్యేలా లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. రష్యాలోని పౌర సమాజ ప్రయోజనాలను అమెరికా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయటం లోనే అన్ని సందేహాలూ దాగి ఉన్నాయి. 


సాధారణంగా ఒక దేశ ప్రభుత్వం తో మరో దేశ ప్రభుత్వం సంప్రదిస్తుంది. కానీ రష్యా ప్రభుత్వం తో సంవాదం నెరపటానికి బదులు అమెరికా ప్రభుత్వం నేరుగా రష్యా ప్రజలతో సంవాదం నడిపేందుకు సిద్దం కావడం పట్ల పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి సాగే ప్రయత్నాలే అన్నది స్పష్టం. 


అమెరికా ప్రభుత్వం పుతిన్ ను గద్దె దింపాలన్న లక్ష్యాన్ని బాహాటంగా ప్రకటించకపోయినా అమెరికా పాలకవర్గం ఈ విషయంలో ఏ మాత్రం సంకోచం లేకుండా వ్యవహరిస్తోంది. అమెరికా పార్లమెంట్ సభ్యుడు లిండ్సే గ్రహం నేరుగా పుతిన్ ను గద్దె దింపేవాడే రష్యాలో లేడా అని బహిరంగంగా ట్వీట్ చేశారు. పైగా అటువంటి పని జరగాలంటే సైన్యం తిరగబడటం ఒక్కటే మార్గం అని కూడా శెలవివ్వడం తీవ్ర వివాదంగా మారింది. 


మార్చి 3న గ్రాహం ట్వీట్ ద్వారా వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కప్పి పెట్టేందుకు అమెరికా అధ్యక్ష భవనం విశ్వ ప్రయత్నం చేసింది. ‘ ఇతర దేశాల అధినేతలను హతమార్చటమో లేక ప్రభుత్వాలు మార్చడమో తమ విధానం కాదు’ అని అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతినిధులెవ్వరూ ఈ విధంగా మాటాడరు అని కూడా జెన్ సకి తెలిపారు. 


వార్స పర్యటన సందర్బంగా బైడెన్ వ్యాఖ్య ఇటువంటి అభిప్రాయాన్ని పెంచి పోషించేదిగా ఉన్నదన్నది వాస్తవం. 
అమెరికా అధికార యంత్రాంగం ఎంత ప్రయత్నం చేసినా రష్యాలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మార్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాలను గద్దెనెక్కించాలన్నది దీర్ఘకాలిక అమెరికా వ్యూహం అన్న వాస్తవాన్ని కప్పిపెట్టలేకపోతోంది. 


రష్యాలో ప్రస్తుతం ప్రభుత్వానిధినేతలకు 71 శాతం ప్రజల మద్దతు ఉందని తాజాగా జరిపిన ఓ సర్వేలో తేలింది. దాంతో రష్యాలో ప్రభుత్వాన్ని మార్చాలన్న అమెరికా కుట్రలకు ఎటువంటి సందూ దొరకడం లేదు. 
చిలీ లో ప్రజలెన్నుకున్న అలెండి ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 11, 1973లో సైనిక కుట్ర ద్వారా కూలదోసి కిరాతకుడుగా పేరు తెచ్చుకున్న పినోచెట్ ను గద్దెనెక్కించిన చరిత్ర అమెరికాది. ఆపరేషన్ కాండోర్ పేరుతో రూపొందించిన అమెరికా కుట్రలో భాగంగా అలెండీని హతమార్చారు. అప్పటి నుండి పదుల సంఖ్యలో ప్రభుత్వాలను కూలడోయడంలో అమెరికా ప్రత్యక్ష పాత్ర పోషించింది. ప్రత్యేకించి లాటిన్ అమెరికా, పశిమాసియాల్లో ఆరని హింసాత్మక గుండాలకు ఆజ్యం పోసింది. 


1973 నుండి అమెరికా సేనటర్ గా ఉన్న బైడెన్ అప్పటి నుండి ఇప్పటివరకు పలు దేశాల్లో ప్రభుత్వాలను మార్చటానికి అమెరికా చేపట్టిన అన్ని చర్యలను సమర్ధించారు. ఒబామా హయాంలో బ్రెజిల్, హోండురస్, పరాగ్వే, ఉక్రెయిన్ల లో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదొసింది. సిరియా, యెమెన్, లిబియాలను బూడిద కుప్పలుగా మార్చింది.

Also Read:

9న “ఒక అస్పృశ్యుని యుద్ధ గాధ” రెండవ భాగం ఆవిష్కరణ

Breaking News: నిలోఫర్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ కవర్ లో బాబు ప్రత్యక్షం

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...