అంతర్జాతీయం Communist Manifesto: మార్క్స్‌ సిద్ధాంతం - చారిత్రక గమ్యం

Communist Manifesto: మార్క్స్‌ సిద్ధాంతం – చారిత్రక గమ్యం

Karl Marx – Communist Manifesto: కార్మికవర్గం సోషలిస్టు సమాజ నిర్మాత అన్న వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావటమే కారల్‌ మార్క్స్‌ సిద్ధాంతంలోని కీలకమైన అంశం. కారల్‌ మార్క్స్‌ ఈ సిద్ధాంతాన్ని ప్రకటించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ సిద్ధాంతం వాస్తవమేనని నిరూపించాయా?

ఈ సిద్ధాంతాన్ని తొలిసారిగా మార్క్స్‌ 1844లో ప్రతిపాదించాడు. మార్క్స్‌, ఏంగెల్స్‌లు 1848లో రచించిన కమ్యూనిస్టు ప్రణాళికలో ఈ సిద్ధాంతానికి సమగ్రతను సమకూర్చారు. కమ్యూనిస్టు ప్రణాళిక సూత్రీకరణలు నేటికీ చారిత్రక సత్యాలుగానే నిలిచి ఉన్నాయి. అప్పటి నుండీ పురోగమించిన ప్రపంచ చరిత్రను మూడు దశలుగా విభజించుకోవచ్చు. 1848 విప్లవాల నుండి 1871 పారిస్‌ కమ్యూన్‌ వరకూ మొదటి దశ. పారిస్‌ కమ్యూన్‌ నుండి 1905 రష్యా విప్లవం వరకూ రెండో దశ. 1905 రష్యా విప్లవం అనంతర కాలం మూడో దశ.

ఈ మూడు దశల్లో కారల్‌ మార్క్స్‌ సిద్ధాంతాలు ఎలా అమలు జరిగాయో పరిశీలిద్దాం.

1

మొదటి దశ తొలినాళ్లల్లో మార్క్స్‌ సిద్ధాంతం అంతగా ప్రభావం చూపలేదు. ఈ దశలో ప్రచారంలో ఉన్న అనేక సోషలిస్టు స్రవంతుల్లో మార్క్స్‌ సిద్ధాంతం కూడా ఒకటిగానే మిగిలిపోయింది. రష్యా లో ప్రాచుర్యం పొందిన నరోద్నిజం తరహా సోషలిస్టు స్రవంతులే (యూరప్‌లో) ప్రచారంలో ఉన్నాయి. చారిత్రక పరిణామానికున్న భౌతికపునాదిని అర్థం చేసుకోవటంలో, పెట్టుబడిదారీ సమాజంలో వివిధ వర్గాలు పోషించే నిర్దిష్ట పాత్రను అంచనా వేయటంలో లోపభూయిష్టమైన అవగాహన, ప్రజలు, న్యాయం, హక్కులు వంటి పదాల మాటున మరుగునపడుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ నిజస్వరూపం, స్వభావాలను అర్థం చేసుకోవటంలోని లోపాలు (వివిధ సోషలిస్టు స్రవంతులలోని పరిమితులు, లోపాలుగా) ఉన్నాయి.

మార్క్స్‌కు పూర్వం ఉన్న పలు సోషలిస్టు స్రవంతులకు 1848 విప్లవాలు పెద్ద కనువిప్పు కలిగించాయి. వివిధ దేశాల్లో అనేక వర్గాలు కార్యరంగంలో దూకాయి. 1848 జూన్‌ మాసంలో ఫ్రాన్స్‌లోని బూర్జువా రిపబ్లికన్లు ఆందోళన చేస్తున్న కార్మికులపై కాల్పులకు పోలీసులను పురమాయించటంతో కేవలం కార్మికవర్గం ఒక్కటే స్వాభావికంగా సోషలిస్టు లక్షణాలు కలిగి ఉంటుందన్న వాస్తవం తేటతెల్లమైంది. ఉదారవాద బూర్జువా వర్గం ఏ ఇతర పరిణామం కంటే కార్మికవర్గం స్వతంత్రంగా వ్యవహరించటం అంటేనే వంద రెట్లు ఎక్కువగా గంగవెర్రులెత్తుతుందని రుజువైంది. పిరికిపందలైన ఉదారవాదులు ప్రతిఘాత శక్తుల ముందు సాగిలపడ్డాయి. భూస్వామ్య అవశేషాల రద్దుతో ఆగ్రహం చెందిన రైతాంగం కూడా పాలకవర్గాల పక్షాన నిలిచింది. ఓ వైపు కార్మిక ప్రజాసామ్యం, మరోవైపున బూర్జువా ఉదారవాదం మధ్య రైతాంగం ఊగిసలాడుతోంది. వర్గ రహిత సోషలిస్టు సిద్ధాంతాలు, వర్గ రహిత రాజకీయాల పట్ల ఉన్న భ్రమలను 1848 విప్లవాలు పటాపంచలు చేశాయి.

ఈ బూర్జువా మార్పు – బూర్జువా రిపబ్లిక్‌ సాధనను – 1871 పారిస్‌ కమ్యూన్‌ పరిపూర్ణం చేసింది. అంటే వర్గ సంబంధాలు నగ్నంగా ఆవిష్కరింపబడే రాజకీయ చట్రంలో ధీరోధాత్తమైన పోరాటం ద్వారానే కార్మికరవ్గం తన స్తానాన్ని పదిలపర్చుకోగలుగుతుందన్న వాస్తవాన్ని 1871 పారిస్‌ కమ్యూన్‌ ప్రపంచం ముందుంచింది.

మిగిలిన యూరోపియన్‌ దేశాల్లో సైతం అపరిపక్వతతో కూడిన అభివృద్ధి కూడా ఇదే పరిణామాలకు దారితీసింది. (ఆయా దేశాల్లో) బూర్జువా సమాజం నిర్దిష్ట రూపం తీసుకుంది. ఈ విప్లవాలు, తిరుగుబాట్లతో కూడిన ఈ మొదటి దశ చివరినాటికి మార్క్స్‌ పూర్వపు సోషలిస్టు భావాలకు కూడా చరమగీతం పాడిరది. స్వతంత్ర కార్మికవర్గ పార్టీలు తెరమీదకు వచ్చాయి. తొలి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ (1864 ` 1872), జర్మన్‌ సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీలు ఈ కోవకు చెందిన తొలి తరం పార్టీలు.

2

1871 నుండి 1904 వరకూ ఉన్న రెండో దశ మొదటి దశతో పోల్చి చూసినప్పుడు శాంతియుతమైన దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో చెప్పుకోదగ్గ తిరుగుబాట్లు, విప్లవాలు చోటు చేసుకోలేదు. పాశ్చాత్య దేశాల్లో బూర్జువా విప్లవాల యుగం ముగిసింది. తూర్పు దేశాలు ఇంకా ఆ దశకు చేరుకోలేదు.

రానున్నకాలంలో జరగబోయే మార్పులకు పశ్చిమదేశాలు శాంతియుతంగా సిద్ధమవుతున్నాయి. అన్ని చోట్లా సోషలిస్టు పార్టీలు, ప్రధానంగా కార్మికవర్గ పార్టీలు ఏర్పడ్డాయి. బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థలో పని చేయటం, స్వంత పత్రికలు పెట్టుకోవటం, విద్యాసంస్థలు, కార్మిక సంఘాలు, సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవటం వంటివి నేర్చుకున్నారు. మార్క్స్‌ సిద్ధాంతం సంపూర్ణ విజయం సాధించింది. దాని ప్రభావం విస్తరించనారంభించింది. కార్మికవర్గం ఎంపిక, ఉనికి ప్రదర్శన భవిష్యత్తు యుద్ధాలకోసం జరిగే సన్నద్ధత మందగమనంతోనైనా ముందడుగు వేసింది.

మార్క్సిజం సిద్ధాంతం సైద్ధాంతిక విజయంతో అనేకమంది మార్క్సిజానికి బద్ద శతృవులైన వాళ్లు మార్క్సిస్టులన్న ముసుగు వేసుకోవటం మొదలుపెట్టారు. అంతర్గతంగా కుళ్లిపోయిన ఉదారవాదం సోషలిస్టు అవకాశవాదం రూపంలో తలెత్తనారంభించింది. భవిష్యత్‌ పోరాటాలకు ఉభయ శిబిరాలు సన్నద్ధమవుతున్న కాలాన్ని పోరాట విరమణ కాలంగా ఈ (అవకాశవాద) శక్తులు వ్యాఖ్యానించాయి. బానిసలు (కార్మికులు) వేతనాల పెరుగుదల కోసం సాగించే పోరాటాన్ని (ఈ అవకాశవాదులు) అణా పైసల కోసం తమ బానిసలు తమ రాజకీయ స్వాతంత్య్రాన్ని విడనాడటంగా భావించారు. భయంతో సామాజిక శాంతి (బానిస యజమానులతో సంధి చేసుకోవాలని) ప్రతిపాదించారు. వర్గ పోరాటాన్ని విస్మరించారు. విడనాడారు. ఇటువంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో చాలామంది వివిధ బూర్జువా పార్లమెంట్లలో సోషలిస్టు ప్రతినిధులుగానూ, పలు కార్మికవర్గ సంఘాల బాధ్యతల్లోనూ ఉన్నారు. మరికొందరు ఇటువంటి అంశాల పట్ల సానుభూతి కలిగి మేధావులుగా ఉన్నారు.

3

తూర్పు దేశాల్లో విప్లవోద్యమాలు ఉవ్వెత్తున ఎగిసినప్పుడు అటువంటి ఉద్యమాలు అసవరం లేదని చెప్పుకున్న ఈ అవకాశవాదులు ఈ ఉద్యమాలను స్వాగతించలేకపోయారు. టర్కీ, పర్షియా, చైనాల బాటలోనే రష్యాలో కూడా విప్లవోద్యమం వెల్లివిరిసింది. ఈ దశలో ఆయా దేశాల్లో వెల్లువెత్తిన విప్లవోద్యమాలు, యూరప్‌లో వాటి పర్యవసానాలు విషయంలో తగిన విధంగా మనం స్పందించలేదు. చైనా రిపబ్లిక్‌ సంగతి ఎలా ఉన్నా దానికి వ్యతిరేకంగా నాగరికత ముసుగు వేసుకున్న భూతాలు ఎంతగా కోరలు చాచినా ఆసియాలో పాతకాలపు అర్థబానిసత్వాన్ని పునరుద్ధరించలేవు. ఆసియా తరహా ఉత్పత్తి విధానం, ఆసియా తరహా అర్థ ఉత్పత్తి విధానం అమల్లో ఉన్న దేశాల్లో సాగుతున్న ధీరోదాత్తమైన పోరాటాలను అణచివేయలేరు.

యూరప్‌లో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగాల్సిన నిర్ణయాత్మక పోరాటాలు దీర్ఘకాలం వాయిదా పడటం పట్ల కొందరు, సార్వత్రిక పోరాటాలకు సిద్ధమవుతున్న రంగాన్ని గమనించటంలో ఏమరుపాటుతో ఉన్న మరికొందరు అటు నిరాశావాదానికో ఇటు అరాచకవాదానికో లోనయ్యారు.

నిజానికి ఆసియా దేశాల్లోని 80 కోట్ల ప్రజానీకం యూరోపియన్‌ కార్మికవర్గం ఏ ఆశయాలకోసమైతే గళమెత్తిందో అదే ఆశయాలకోసం పోరాట రంగంలో నిలించింది. ఇది మనంమంతా సంబరపడాల్సిన సందర్భమే తప్ప నిరాశ చెందాల్సి సమయం కాదు.

ప్రజాతంత్ర సమూహాల స్వాతంత్య్రం యొక్క తిరుగులేని ప్రాధాన్యతను గుర్తించటంలో పాశ్చాత్యదేశాల ఉదారవాదపు వెన్నెముక నిటారుగా నిలబడలేదన్న వాస్తవాన్ని ఆసియా దేశాల్లో సాగుతున్న పోరాటాలు మరోసారి ధృవీకరిస్తున్నాయి. అన్ని బూర్జువా ఉదారవాదానికి, కార్మిక వర్గ విప్లవాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా ముందుకు తెచ్చింది. యూరోపియన్‌ దేశాల అనుభవం, ఆసియా దేశాల అనుభవాలను చూసిన తర్వాత ఎవ్వరైనా వర్గేతర రాజకీయాలు, వర్గేతర సోషలిజం ఉంటుందని వాదిస్తే వాళ్లను బోనులో పెట్టి ఆస్ట్రేలియాలోని కంగారూల మ్యూజియంలోనో మరో చోటనో ప్రదర్శనకు పెట్టాలి.

ఆసియా దేశాల తర్వాత యూరప్‌లో కూడా తిరుగుబాట్లు మొదలయ్యాయి. కానీ అవి ఆసియా తరహా తిరుగుబాట్లు కావు. 1872 నుండి 1904 వరకూ కొనసాగిన శాంతియుత పరిస్థితులు తిరిగి వచ్చే అవకాశం లేకుండా కనుమరుగయ్యాయి. పెరుగుతున్న జీవన వ్యయ భారం, ట్రస్టుల దోపిడీ (కంపెనీల) ఆర్థిక పోరాటాలకు పదును పెట్టాల్సిన పరిస్థితులు కల్పించింది. ఈ పరిస్థితులు ఉదారవాదంతో ప్రభావితమైన ఇంగ్లాండ్‌ కార్మికవర్గాన్ని కూడా వీధుల్లోకి లాగాయి. అత్యంత తిరోగామి బూర్జువా భూస్వామ్య దేశమైన జర్మనీలో సైతం తిరుగుబాటు కలకలం మొదలైంది. సామ్రాజ్యవాదం, పెరుగుతున్న ఆయుధోత్పత్తి యూరప్‌లోని సామాజిక శాంతిని తుపాకీలో పోసే పేలుడు సామాగ్రి మార్చేస్తోంది. ఈ కాలంలోనే అన్ని దేశాల్లోనూ బూర్జువా పార్టీలు పతనమై వాటి స్థానంలో కార్మికవర్గ పార్టీలు తెరమీదకొస్తున్నాయి.

మార్క్సిజం తెరమీదకొచ్చిన తర్వాత ప్రపంచ చరిత్ర ప్రయాణించి ఈ మూడు మహత్తర దశల్లోనూ మార్క్సిస్టు సిద్ధాంతం పదేపదే రుజువవుతూ వచ్చింది. పదేపదే విజయం సాధిస్తూ వచ్చింది. రానున్న కాలంలో మార్కిస్టు సిద్ధాంతానికి, కార్మికవర్గ విప్లవానికి మరిన్ని విజయాలు సమకూరనున్నాయి.

వ్యాసకర్త: వి ఐ లెనిన్‌
ప్రావ్దా, 1913, మార్చి 1
అనువాదం : కొండూరి వీరయ్య

(కమ్యూనిస్టు ప్రణాళిక 175 జయంతి దిశగా తెలుగడ్డా వారం వారం అందిస్తున్న విశ్లేషణల్లో భాగంగా ఈ వారం లెనిన్‌ వ్యాఖ్యానాన్ని మీ ముందుకు తెస్తున్నాము ` తెలుగడ్డా సంపాదకులు)

Also Read…

Communist Manifesto: కమ్యూనిస్టు ప్రణాళిక నాటి యూరప్‌ స్థితిగతులు

యాసంగి వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ సమావేశం

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...