అంతర్జాతీయం Sri Lanka: ఆర్థిక సంక్షోభం గుప్పిట్లో శ్రీలంక

Sri Lanka: ఆర్థిక సంక్షోభం గుప్పిట్లో శ్రీలంక

Sri Lanka Crisis – Gotabaya Rajapaksa: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు అర్ధరాత్రి అధ్యక్ష భవనం చుట్టుముట్టారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు మొహరించాల్సి వచ్చింది. 45 నలుగురు ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. నీటి ఫిరంగి వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు రెండు పోలీసు మోటారు బైకులు పోలీసు వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు.

దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. నిత్యవసర వస్తువులు గ్యాస్ పెట్రోల్ వంటి ఆధునిక జీవనాన్ని నడిపించే సరుకులు కూడా సమకూర్చు కోలేని దుస్థితికి శ్రీలంక చేరింది. శ్రీలంక స్వాతంత్రం పొందిన తర్వాత ఇంతటి ఘోరమైన సంక్షోభం ఇంతవరకు చవిచూడలేదు. గత గురువారం నాటికి దేశంలో చుక్క డీజిల్ లేకుండా పోయింది. ప్రజలు దాదాపు 13 గంటల పాటు కరెంటు కోతలు ఎదుర్కొంటున్నారు. రవాణా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరెంటు కోత కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో దాదాపుగా శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి.

రవాణా సదుపాయాలు లేని కారణంగా పాలు ఆస్పత్రులు మందుల దుకాణాలు అత్యవసర మందుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కరెంటు కొరతతో మొబైల్ సేవలు కూడా నిలిచిపోయాయి. అరకొర ఫోన్లు చేయడానికి అవకాశం ఉన్నా వాయిస్ స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. కొలంబో స్టాక్ ఎక్చేంజి ఒకటి రెండు గంటలకు మించి లావాదేవీలు జరపడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అత్యవసర సేవలకు అవసరమైన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. సాధారణ సేవలు ఉద్యోగులు ఇంటి వద్దనే ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రికి అధ్యక్ష భవనం చుట్టూ ప్రజలు గుమికూడటం మొదలైంది. అధ్యక్షుడు రాజీనామా చేయాలని నినాదాలు నెమ్మదిగా మొదలై పొలికేకలు గా మారాయి. శ్రీలంక రాజకీయాలను రాజపక్షే కుటుంబ శాసిస్తోంది. గట్బోయ రాజపక్సే అధ్యక్షుడిగా ఉంటే ఆయన తమ్ముడు మహేంద్ర రాజుపక్ష ప్రధానమంత్రి గాను చిన్న తమ్ముడు బేసిల్ రాజపక్ష ఆర్థికమంత్రిగా ఉన్నారు. గట్బోయ పెద్దన్న చమల్ రాజపక్సే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే వారి బంధువు నిర్మల్ రాజపక్ష క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.

అధ్యక్ష భవనం వెలుపల నినాదాలు ఇస్తూ నిరసన పతాకాలను ఎగురవేసిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది. నిరసనకారులు ఖాళీ నీళ్ల సీసాలు, చేతిలో ఉన్న సాధనాలు పోలీసుల పైకి ఇవ్వడం ప్రారంభించారు. చివరకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

పోలీసులు అటకాయించి పోలీసు వాహనాలకు నిప్పంటిస్తూన్న దృశ్యాలు టీవీలలో ప్రసారం అయ్యాయి. అయితే నిరసనకారులు అధ్యక్ష భవనం చుట్టుముట్టిన సమయంలో దేశాధ్యక్షుడు గొట్బయ రాజపక్ష ఇంటి వద్ద లేరని వార్తా సంస్థలు వెల్లడించాయి.

కొలంబో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నందకుమార్ నిరసనకారులు అభ్యంతరంగా వ్యవహరించి లేదని, ఈ నిరసన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. నిరసనకారులు ఎలా చెదరగొట్టే వ్యూహం రూపొందించారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అని చెప్పే స్థితిలో లేమని నందకుమార్ తెలిపారు. బుధవారం నుంచి దేశంలో వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. అనేక నగరాల్లో మోటారు వాహనదారులు రహదారులను అడ్డగించారు.

ఆర్థిక పరిస్థితి రీత్యా 2020 లోనే శ్రీలంక ప్రభుత్వం అనేక దిగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో పెట్రోలు డీజిల్ తో సహా నిత్యావసర సరుకులు కొరత మరింత తీవ్రమైంది. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం యాభై ఒక బిలియన్ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుంది. మరిన్ని అప్పులు భరించలేని స్థితికి చేరుకున్న దేశం దిగుమతులపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ ఆర్థిక సమర్ధతతో ఏర్పడిన కొరత దేశంలో నిత్యావసర వస్తు ధరలు ఆకాశానికి పెంచేసింది.

భారత్ చైనాలు ఆదుకోవాలని శ్రీలంక ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపించింది దేశ ఆర్థిక వ్యవస్థను ఒడ్డున పడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సహకారాన్ని కూడా కోరుతున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.

  • తెలుగడ్డా ప్రత్యేకం

Also Read…

కాశ్మీర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ పుస్తకాలు చదవండి

మీకు తెలుగు సంవత్సరాలు తెలుసా? మీరు పుట్టిన తెలుగు సంవత్సరం?

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...