Health Tips: ఆహారం.. ఆరు సూత్రాలు

0
232

Health Tips:

  • కడుపు ఖాళీగా ఉన్నప్పుడు శరీరంలో గ్రెలిన్ అనే హోర్మోన్ విడుదలవుతుంది. అది ఆకలిగా ఉందనే విషయాన్ని మెదడుకు తెలియజేస్తుంది. మెదడులోని హిప్పోక్యాం పసన్ను గెలిన్ ఉత్తేజితం చేసి చురుకుగా, చలాకీగా ఉండేలా చేస్తుంది. అలాగని తినాల్సిన అవసరం లేదనికాదు. కాకపోతే మనం ఎంత తింటున్నామనే విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలన్న సంగతిని ఇది తెలియజేస్తుంది.
  • రోజంతా తింటూ ఉండడం మంచిది కాదు. ఒక క్రమానుగుణంగా తినడం ఆరోగ్యానికి మంచిది. ముప్ఫై ఏళ్ల లోపు వాళ్లయితే రోజుకు మూడుపూటలు, ముప్ఫై పైబడిన వాళ్లయితే రెండు పూటలు తినడం ఉత్తమం.
  • ఆహారాన్ని నములడం అనేది జీవక్రియలో ముఖ్యమైన పాత్ర. అందుకే ఆహారాన్ని మింగడానికి ముందు బాగా నములాలి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారప దార్థాలు లాలాజలం ద్వారానే ముప్ఫై శాతం జీర్ణమవుతాయి. కాబట్టి ఒక ముద్దను 24 సార్లు నములడం మంచిది. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోకుండా రెండు గంటల వ్యవధిని ఇవ్వండి.
  • ఆహారం తీసుకున్న రెండు గంటల్లోపు శరీరంలోకి వివిధ భాగాలకు శక్తిరూపంలో సరఫరా అవ్వాలి. పది నుంచి పన్నెండు గంటల్లోపు వ్యర్థరూపకంగా బయటకు వెళ్లిపోవాలి. ఆ విధమైన స్పృహను కలిగి ఉండాలి.
  • సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆయా కాలా నికి అనుగుణంగా లభించే కాయగూరలతో శరీరానికి సరిపడునట్లు వండుకొని తినే వివేకాన్ని ప్రదర్శించాలి.
  • శరీరానికి సమతుల ఆహారం ఎంతో అవసరం. మామూలు ఆహారంతో పాటు విభిన్న రకాల ధాన్యపు గింజలను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. శరీరతత్వాన్ని బట్టి ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Also Read:

Read the health tips here:
ఆరోగ్య చిట్కాలు

Soap Nuts Benefits : కుంకుడు కాయలు జుట్టు సంరక్షణకే కాదు. వీటి వలన ప్రయోజనాలెన్నో..

Regi Pandu Benefits: రక్తశుద్ధికి రేగుపండు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here