Health in Old age: వృద్యాప్యంలో కూడా…

0
165

Health on Old age: ఉత్సాహంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? చాలామంది యాంటీ ఏజింగ్ క్రీములను ట్రై చేస్తుంటారు. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా వృద్ధాప్యాన్ని ఎదుర్కోవచ్చు.
ఏం తినాలంటే…

  • స్ట్రాబెర్రీలు బాగా తినాలి.
  • ఆహారంలో క్యాబేజీ ఎక్కువగా తీసుకోవాలి.
  • రోజుకో పచ్చి క్యారెట్ కరకరలాడించాలి
  • విటమిన్ ‘సి’ రెగ్యులర్గా తీసుకోవాలి.
  • ద్రాక్షపళ్ళు దొరికినవి దొరికినట్టు తినేయాలి.
  • ఉల్లిపాయలు బాగా తినాలి ? టమాటా కూడా తింటుండాలి.
  • వీటితోపాటు మంచినీళ్ళు బాగా తాగాలి. వ్యాయామం రెగ్యులర్గా చేయాలి. ఇవి పాటిస్తే వృద్ధాప్య లక్షణాల్ని నివారించవచ్చు.
  • ఓల్డ్ ఏజ్ డైట్:
    వృద్ధాప్యం వల్ల ఎముకలు, దంతాల బలం తగ్గుతుంది. కాబట్టి కాల్షియం ఎక్కువగా అవసరం అవుతుంది. అందువల్ల పాలు బాగా తాగాలి. ఉదయం, సాయంత్రం వీలైతే రాత్రి నిద్రించేముందు కూడా పాలుతాగటం మంచిది. వారానికి కనీసం మూడుసార్లయినా కోడిగుడ్లు తినాలి. స్థూలకాయులు ముందుగా డాక్టర్ ని సంప్రదించటం మంచిది.

మలబద్ధకం ఈ వయసులో ఏర్పడే ప్రధాన సమస్య కాబట్టి పీచు పదార్థాలు రోజూ తీసుకోవాలి. కమల, నారింజ, టమాటా, సపోటా వంటివి ఎక్కువగా తీసుకుంటుండాలి. ఓపిక లేదంటూ ఒకేచోట కదలకుండా కూర్చోకుండా ఉదయం, సాయంత్రం అలా కొంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు తీసుకోవాలి. యోగ, ధ్యానం ఈ వయసులో అలవర్చుకోవడం చాలా అవసరం.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here