Health Tips: తక్కువ ప్రోటీన్లు ఎక్కువ కార్బొహైడ్రేట్లు మూడు నెలలకొకసారి ఉపవాసంతో దీర్ఘాయుష్మాన్భవ !

0
113

తెలుగడ్డ ప్రత్యేకం: మీరు సాధ్యమైనంత కాలం ఆరోగ్యంగా బతకాలనుకుంటున్నారా? మీ తిండిలో ప్రోటీన్లు తగ్గించుకోండి. కార్బొహైడ్రేట్లు పెంచండి. తరచూ ఉపవాసం ఉండండి అంటూ సెల్‌ అనే వైద్య పరిశోధన, పౌష్టికాహార విషయాలకు సంబంధించిన విశ్లేషణలు ప్రచురించే పత్రికలో వచ్చిన విశ్లేషణ.

ప్రాసెస్డ్‌ ఆహారంలోనూ, మాంసంలోనూ ఉండే పోషకాల కంటే వృక్షజాతులకు చెందిన ఆహారోత్పత్తుల్లో పోషకాలు మెండుగా ఉంటాయని పరిశోధకులు ఈ పత్రికలో వచ్చిన విశ్లేషణలో తెలియచేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జెరెంటోలజీ ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్న వాల్టర్‌ లాంగో, విస్కన్సిన్‌ విశ్వవిద్యాలయంలో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ మరియు పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్న రోజలిన్‌ ఎం ఆండర్సన్‌లు ఉమ్మడిగా సాగించిన పరిశోధనా వివరాలు సెల్‌ అనే పరిశోధనా జర్నల్‌లో ప్రచురించారు.

లాంగో ఉపవాసం చేసేవాళ్లకు అవసరమైన పోషకాహార మిశ్రమాలను తయారుచేసే కంపెనీ కూడా నడుపుతున్నారు. ఈయన రూపొందించిన మిశ్రమాలు శరీరంలోకి వెళ్లే కెలోరీలను బాగా తగ్గించేందుకు వీలుగా కొద్ది మోతాదుల్లో ప్రోటీన్లు ఉండేలా రూపొందించారు. అమెరికాకు చెందిన సెలబ్రిటీ గ్వినెత్‌ పాల్ట్రో కూడా ఫ్రొఫెసర్‌ లాంగో రూపొందించిన మిశ్రమాహారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు.

మనం తీసుకునే ఆహారంలో ఈ రకమైన మిశ్రమం ఉండేలా చూసుకోవటం దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ సూత్రమని లాంగో ప్రతిపాదిస్తున్నారు. ఆయన మాటల్లో ‘‘దీర్ఘకాలం బతకటానికి ఉపకరించే ఆహారం అంటే బరువు తగ్గటానికో లేదా కొవ్వు తగ్గించుకోవటానికో తీసుకునే ఆహారం కాదు. వార్ధ్యక్యాన్ని వాయిదా వేసే ఆహారం.’’.
దీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలంటే ఎక్కువ కార్బొహైడ్రేట్లు తక్కువ ప్రోటీన్లు తీసుకోవాలి. ధాన్యం, కూరగాయలుతో పాటు రోజుకు తీసుకునే ఆహారంలో షుమారు 30 శాతం కెలోరీలు సమకూర్చుకునేలా పప్పులు, ఆలివ్‌ ఆయిలు, డార్క్‌ చాక్లెట్‌, చేపలు తీసుకోవాలని ఈ పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు. ప్రధానంగా వృక్ష సంబంధిత ఆహారం సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవటం మెరుగైన మార్గమని ప్రతిపాదిస్తున్నారు.

ప్రాసెస్డ్‌ మాంసం, రెడ్‌ మీట్‌ వినియోగంతో పాటు చెక్కర కలిపి రిఫైన్డ్‌ గ్రెయిన్స్‌ తగ్గించాలని, కోడి మాంసం వంటి మాంసపు ఉత్పత్తులు పరిమితంగా తీసుకోవాలని లాంగో, ఆండర్సన్‌లు ప్రతిపాదిస్తున్నారు. ప్రాసెస్డ్‌ ఆహారం స్థానంలో మొక్కల నుండి ఉత్పత్తి అయ్యే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కనీసం పదేళ్ల పాటు జీవన కాలాన్ని పెంచుకోవచ్చని ఈ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో దీర్ఘాయుష్షు కలిగిన ప్రజలు జీవించే ప్రాంతాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్లూ జోన్స్‌గా వర్గీకరించింది. ఆ ప్రాంతాల్లో ప్రజలు తీసుకునే ఆహారం కూడా ఇదేనని లాంగో, ఆండర్సన్‌లు చెప్తున్నారు.

ప్రోటీన్లు పరిమితం గా తీసుకోవటం ద్వారా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చని వీరిరువురూ ప్రతిపాదించారు. ఆ మేరకు తమ ప్రయోగాల నుండి సాధించిన ఫలితాలు తమ ప్రతిపాదనలను ధృవీకరిస్తున్నాయని ఆ వ్యాసంలో వివరించారు. ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు తీసుకోవటం ద్వారా శరీరంలో తయారయ్యే కొన్ని ఆమ్ల ద్రవాల కారణంగా శరీరం త్వరగా వార్ధక్యాన్ని సంతరించుకుంటుందని తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడిరచారు.

మెరుగైన ఆరోగ్యం కోసం ఇంటర్మిటెంట్‌ డైట్‌ తో పాటు వీలున్నప్పుడుల్లా ఉపవాసాన్ని పాటించటం మంచిదని ప్రతిపాదిస్తున్నారు. ఏమి తింటామో అన్నదానితో పాటు ఎప్పుడు తింటాము అన్నది కూడా ఆయు:ప్రమాణాన్ని ప్రభావితం చేసే అంశమని ఈ వ్యాసంలో హెచ్చరించారు. మెరుగైన ఆరోగ్యం కోసం రోజులో రెండు సార్లు మితమైన ఆహారం తీసుకుంటే సరిపోతుందని, ఈ విధంగా తీసుకునే ఆహారం 11 ` 12 గంటల వ్యవధిలో తీసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుందని ఈ శాస్త్రవేత్తలు రాసిన వ్యాసంలో వివరించారు. దీన్నే ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అని పిలుస్తున్నారు. ఈ పద్ధతుల్లో మితాహారం తీసుకున్న వారిపై జరిగిన పరిశోధనలు మిశ్రమ ఫలితాలనిచ్చాయి.

ప్రతి మూడు నెల్లకొకసారి ఐదు రోజులు ఉపవాసం ఉంటే మెరుగైన ఫలితం ఉంటుందని మనుషులు, జంతువులపై సాగించిన తమ పరిశోధనలు ధృవీకరిస్తున్నాయని అంటున్నారు. ఈ విధంగా చేయటం ద్వారా రక్త ప్రసరణ వేగవంతమవుతుందని, ఆయుష్షు పెరుగుతుందని ఈ పరిశోధకులు వెల్లడిరచారు. అయితే రాబ్‌ వూల్ఫ్‌ అనే పోషకాహర నిపుణులు ఇలా ఎక్కువ రోజులు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే ఇబ్బందికర పరిణామాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని కూడా హెచ్చరిస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here