Regi Pandu Benefits: రక్తశుద్ధికి రేగుపండు

0
252

తెలుగునాట సంక్రాంతి శోభకి రేగుపళ్ళు ఎంతో ప్రసిద్ధి. శీతాకాలంలో దొరికే రేగుపండ్లను తినడం వలన చాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తిపి, పులుపు రుచుల మేళవింపు అయిన రేగుపళ్ళు మానవాళికి ఎంతో ప్రయోజనకారులు. రేగిపళ్ళతో పాటు గింజలు, ఆకులు, బెరుడు సైతం, దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

రక్తంలోని ఎర్ర కణాల వృద్ధికి దోహదపడుతుంది. రక్త హీనత, ఐరన్ లోపం కండరాల బలహీనతతో బాధపడే వారు రేగిపళ్ళుతింటే ఫలితం కనిపిస్తుంది. అజీర్తి సమస్య తగ్గుతుంది. బరువును తగ్గిస్తాయి. వీటిలో పోషకాలతో పాటు కాల్షియం, ఐరన్, పాన్ఫరస్ లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను, దంతాలను, దృఢంగా చేస్తాయి. వ్యాధిని రోధక శక్తి పెంచేగుణాలున్నాయి.

పిల్లలకు సంక్రాంతినాడు “బోగిపళ్ళు”గా వారికి పోస్తారు. వారిలో మానసిక, శారీరక ఎదుగుదలకు ఇవి ఎంతో మంచివి. వీటిలో కేలరీలు, ప్రోటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువ. చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. రేగిపళ్ళలోని అల్కాలాయిడ్స్ రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలోని ప్రమాదకర విషపదార్థాలను బయటకు పంపుతాయి. చర్మం పై బొబ్బలు, కురుపులు వచ్చి బాధిస్తుంటే రేగు పండు ఆకులను నూరి చర్మం పై రాసుకోవడం వలన వెంటనే నయమవుతాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here