జీవనశైలి Soap Nuts Benefits : కుంకుడు కాయలు జుట్టు సంరక్షణకే కాదు. వీటి వలన ప్రయోజనాలెన్నో..

Soap Nuts Benefits : కుంకుడు కాయలు జుట్టు సంరక్షణకే కాదు. వీటి వలన ప్రయోజనాలెన్నో..

Soap Nuts Benefits: ఆధునికత పెరిగే కొద్దీ పాత ఆరోగ్య విధానాలను వదిలేస్తున్నాం. స్నానానికి రసాయనాలతో కూడిన ఖరీదైన షాంపూలు, సబ్బులను వాడుతూ.. ప్రకృతిలో లభ్యమయ్యే కుంకుడు కాయలు, శీకాయ, సున్నిపిండి వంటివి మరచి పోతున్నాం. ఇక ఉద్యోగస్థుల విషయానికి వస్తే కుంకుడు కాయలు కొట్టి నానబెట్టడానికి ఖాళీ సమయమే కరువైంది. వీటిని కొట్టడంతో ఇంట్లోని మార్పుల్, సిరామిక్ గచ్చులు పాడైపోతాయని కొందరు కుంకుళ్ల జోలికే వెళ్లడం లేదు. అందమైన 3 సీసాలు, ఆకట్టుకునే ప్యాకింగ్ లో లభించే షాంపూల వైపే మొగ్గు చూపుతున్నారు. చౌకగా లభిస్తూ.. ఆరోగ్యాన్నిచ్చే కుంకుడుకాయల వైపు -3 కన్నెత్తి చూడటం దాదాపు మానేశాం. అయితే వీటివల్లే కురుల కుదురు ఆరోగ్యంగా ఉండి, దృఢంగా పెరిగేది. అందుకే వీటివల్ల ప్రయోజనాలేంటో చూద్దాం.

కుంకుడుకాయ
  1. తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు.
  2. కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతిసారీ కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది.
  3. ఎండబెట్టిన కమలా, నిమ్మతొక్కలు, మందారాకులు, పూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నింటినీ కలిపిన పొడితో తలస్నానం చేస్తే వెంట్రుకలు తొందరగా తెల్లబడవు. జుట్టు ఊడదు కూడా. అంతేకాదు జుట్టు మృదువుగా ఉంటుంది.
  4. కుంకుడు కాయలతో తలస్నానం చేయడం వల్ల జుట్టు జిడ్డులేకుండా శుభ్రపడుతుంది. పైగా వీటిలో ఎటువంటి రసాయన పదార్థాలు కలువవు కనుక ఆరోగ్యానికి మంచిది. జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.
  5. ఇవి తలస్నానానికే కాక, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దురద, అలర్జీలను నివారిస్తుంది.
  6. కుంకుడు రసంలో పట్టుచీరలను నాన పెట్టి ఉతికితే అవి మెరుస్తాయి. బంగారు ఆభరణాలనూ కుంకుడు రసంలో నానబెట్టి, మెత్తని బ్రష్ తో మృదువుగా రుద్దితే… అవి శుభ్రపడి, ధగధగా మెరుస్తాయి.
  7. కుంకుడు రసంతో కాస్త వెనిగర్ కలిపి గాజు సామాన్లు కిటికీలు అద్దాలు తుడిస్తే మెరిసిపోతాయి. ఎన్ని క్లీనింగ్ రసాయనాలు వాడినా స్నానాల గది మురికిగానే ఉన్నటుంటుంది. కుంకుడు రసంలో బేకింగ్ సోడా ఒక స్పూన్ బొరాక్స్ పౌడర్ ను కలిపి ఇందులో కాస్త యూకలిఫ్టస్ ఆయిల్ కలిపి బాత్ రూమ్ క్లీన్ చేస్తే నేల గోడలు కూడా క్లీన్ గా అయిపోతాయి.
  8. కుంకుడు రసంతో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి గూడాల వారగా చల్లితే దోమలు ఈగల బెడద వుండదు.
  9. కుంకుళ్ల రసాన్ని మొక్కలమీద చల్లితే ఆ వాసనకి క్రిమికీటకాలు నశిస్తాయి. పండ్లూ కూరగాయల్ని కుంకుడు రసం కలిపిన నీటిలో నానబెడితే వాటికి ఉన్న రసాయనాల అవశేషాలన్నీ పోతాయి.

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...